Devi Sri Prasad: అతనిలో గొప్పనటుడు ఉన్నాడు: దేవిశ్రీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే చిత్రబృందం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ ఎఫ్ 3 సినిమా ఎంత ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది అంటే ఈ సినిమా చూసి పడి పడి నవ్వుకుంటారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా.ప్రతి ఒక్క ప్రేక్షకుడిని నవ్వించాలని కంకణం కట్టుకొని ఈ సినిమాని చేశామని దేవిశ్రీ వెల్లడించారు. ఎఫ్ 3 సినిమా అంటేనే ఒక ఆరోగ్యకరమైన నవ్వుల సినిమా అని చెప్పాలి. ఒకప్పుడు ఇ.వి.వి. సత్యనారాయణ వంటి దర్శకులు ఇలాంటి సినిమాలను తెరకెక్కించారు.

అదే తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందని దేవిశ్రీ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ నటన అద్భుతమని, ఆలీ సునీల్ వంటి పాత్రలు కూడా ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకొని అందరిని నవ్విస్తాయని దేవిశ్రీ తెలిపారు.ఎఫ్ 2 ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే దానికి మించి ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని,ఆయన స్క్రిప్టు చెబుతుంటేనే ఈ సినిమా చూసిన భావన కలుగుతుందని దేవిశ్రీప్రసాద్ తెలియజేశారు.

ఇక ఈయన స్క్రిప్ట్ చెబుతున్నప్పుడు వెంకటేష్ పాత్ర వివరిస్తే వెంకటేష్ లాగే నటించి చూపించేవారు. అలాగే వరుణ్ వరుణ్ తేజ్ పాత్ర చెప్పేటప్పుడు వరుణ్ లా నటించి చూపించేవారు. అనిల్ రావిపూడిలో ఒక దర్శకుడు మాత్రమే కాదు ఆయనలో నటుడు కూడా దాగి ఉన్నాడని ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus