Devi Sri Prasad: ‘పుష్ప 3’ గురించి దేవిశ్రీప్రసాద్‌ కామెంట్స్‌… అంటే ప్రాజెక్టు ఉన్నట్లేగా..!

‘పుష్ప : ది రూల్‌’ సినిమా సెట్స్‌ మీద ఉండగానే ‘పుష్ప 3’ సినిమా ఉండొచ్చు అని వార్తలొచ్చాయి. నిజమా కాదా అనే డౌట్ ఉండగానే ఆ సినిమా పేరు ‘పుష్ప: ది ర్యాంపేజ్‌’ అనే పేరు కూడా లీక్‌ అయిపోయింది. సినిమా వచ్చాక మూడో ‘పుష్ప 3’ పక్కా అని తేలిపోయింది. అయితే సినిమా ఫలితం గురించి, వసూళ్ల గురించి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ కారణంగా మూడో ‘పుష్ప’ వస్తాడా రాడా అనే డౌట్‌ ఏర్పడింది.

Devi Sri Prasad

కానీ, ఇప్పుడు ఆ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మాటలు వింటుంటే ‘పుష్ప 3’ పక్కాగా ఉంది అనిపిస్తోంది. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాని డీఎస్పీ ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ సీక్వెల్‌ గురించి మాట్లాడారు. దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప 3’ సినిమాకు సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ స్టోరీపై రీవర్క్‌ చేస్తున్నారని తెలిపారు.

‘పుష్ప: ది రైజ్‌’, ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలకు పనిచేసినట్లే ‘పుష్ప 3’కి కూడా చేస్తామని చెప్పారు దేవిశ్రీ ప్రసాద్‌. ‘పుష్ప 2’ కోసం చేసిన కొన్ని ట్యూన్స్‌ ఉండిపోయాయని, వాటిని ‘పుష్ప 3’లో వాడే అవకాశం ఉందని చెప్పాయాన. సుకుమార్‌.. రామ్‌ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించారు. అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇవి పూర్తయ్యాక ‘పుష్ప 3’ని పట్టాలెక్కిస్తారని సమాచారం.

అయితే.. అది అంత ఈజీ కాదు అని అంటున్నారు. ప్రజలు ‘పుష్ప’రాజ్‌ కోసం అన్ని రోజులు వెయిట్‌ చేస్తారా? వచ్చినా కనెక్ట్‌ అవుతారా అనేది చూడాలి. ఎందుకంటే ‘పుష్ప: ది రైజ్‌’ తర్వాత మరో సినిమా చేయకుండా బన్నీ ‘పుష్ప: ది రూల్‌’ చేశాడు. దాని వల్ల అదే ఫ్లోలో వెళ్లినట్లు అయింది. మరిప్పుడు లాంగ్‌ గ్యాప్‌ వస్తుంది అని అంటున్నారు. చూద్దాం గ్యాప్‌ తర్వాత ఎవరి ఆలోచనలు ఎలా మారుతాయో.

టాలీవుడ్‌ పై ఫోకస్.. వెయ్యికోట్ల ప్లాన్?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus