Netflix: టాలీవుడ్‌ పై ఫోకస్.. వెయ్యికోట్ల ప్లాన్?

సంక్రాంతి సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ వేడుకల హడావిడి జరుగుతుండగా, ఓటీటీ రంగంలోనూ ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ టాలీవుడ్ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ తెలుగు చిత్రాల హక్కుల కోసం ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందట.

Netflix

ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. ఇందులో పవన్ కల్యాణ్‌ నటించిన OG హక్కులు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌కు పెద్ద ఎసెట్‌గా మారనుందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అలాగే విజయ్ దేవరకొండ VD12, నాని హిట్ 3, నాగచైతన్య తండేల్ వంటి చిత్రాలను కూడా నెట్‌ఫ్లిక్స్‌ హక్కులు దక్కించుకుంది.

ఇక రవితేజ మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, జాక్, కోర్ట్‌ వంటి సినిమాలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న మాడ్ స్క్వేర్‌ లాంటి కొత్త తరహా ప్రాజెక్టులకు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రాధాన్యం దక్కడం విశేషం. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడం, స్ట్రీమింగ్‌ హక్కులు దక్కించుకోవడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ గేమ్‌నే మార్చేస్తోంది.

ఈ నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు ప్రేక్షకులను ఆకర్షించే వ్యూహానికి బలమైన బాటలు వేసింది. టాలీవుడ్‌ లో పెద్ద నిర్మాణ సంస్థలతో జతకట్టి, డిజిటల్‌ రంగంలో కొత్త మార్కెట్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులపై నెట్‌ఫ్లిక్స్‌ పెట్టుబడుల ధోరణి మరింత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఏకైక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నెట్‌ఫ్లిక్స్‌ నిలిచింది. పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను పొందుపరిచింది. ఇక ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో, ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.

2024 సంక్రాంతి కలిసి రాలేదు.. 2025 సంక్రాంతి మొత్తం ఆమెదే!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus