‘పుష్ప 2’ (Pushpa2) చిత్రం నుండి డీఎస్పీ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) స్థానంలో తమన్ (S.S.Thaman), అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath), సామ్ సి ఎస్ (Sam C. S.) వంటి వారిని తీసుకుని.. వాళ్ళతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్ (Sukumar) అని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రచారం దేవి శ్రీ ప్రసాద్ ని అభిమానించే వారిని బాగా నిరుత్సాహపరుస్తుంది. వాస్తవానికి సుకుమార్ సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ బ్లడ్డు పెట్టి పనిచేస్తూ ఉంటాడు.
సుకుమార్ మొదటి నుండి లేజీగా పనిచేసి చివర్లో అంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో టెక్నిషియన్స్ ని కంగారు పెడుతూ ఉంటాడు. ఆర్టిస్ట్ లేదా టెక్నిషియన్ కాల్షీట్స్ ని సరిగ్గా వాడుకోడు అనే కంప్లైంట్ కూడా ఉంది. ‘పుష్ప 2’ గ్లింప్స్ లో దేవి శ్రీ ప్రసాద్ బీజీఎం హైలెట్ గా ఉంటుంది.
హైప్ తీసుకొచ్చింది కూడా అదే. ‘పుష్ప’ కి (Pushpa) కూడా మంచి ఔట్పుట్ ఇచ్చాడు దేవీ. అయినా దేవి ఎందుకు ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ పై వర్క్ చెయ్యట్లేదు అనేది అందరిలోనూ మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అది పక్కన పెడితే.. దేవీ కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. వచ్చే వారం ‘కంగువా’ (Kanguva) రిలీజ్ అవుతుంది. దానికి దేవీ శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు.
ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని కథ ప్రకారం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమని అంటున్నారు. ఒకవేళ దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్కౌట్ అయితే.. అతని పై వచ్చిన రిమార్క్స్ తొలగిపోతాయి. ‘పుష్ప 2’ విషయంలో అతనికి సింపతీ మరింతగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.