‘ఉప్పెన’, ‘రంగ్‌ దే’.. పాటలకు రెస్పాన్స్ అదిరిపోతుందిగా..!

‘దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో సరైన మ్యూజిక్ అందించలేకపోతున్నాడు. అతను ఫామ్లో లేడు. తమన్ పాటల పక్కన దేవి పాటలు తేలిపోతున్నాయి’.. ఇవి ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల టైములో వినబడిన కామెంట్స్. ఇక ‘మహర్షి’ సినిమా టైములో అయితే ఇంతకు మించిన విమర్శలు ఎదుర్కొన్నాడు దేవి శ్రీ ప్రసాద్. గతంలో ఇతని మ్యూజిక్.. సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా .. నిత్యం పెద్ద పెద్ద సినిమాలకు పనిచేస్తూ ఉండే దేవి శ్రీ ప్రసాద్ దూసుకుపోయేవాడు.

అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ను ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల నుండీ తప్పించడం ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే తాజాగా విడుదలైన ‘ఉప్పెన’ ‘రంగ్ దే’ చిత్రాల పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. వైష్ణవ్‌ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఉప్పెన’ చిత్రం నుండీ ‘రంగులద్దుకున్న’ పాట మూడో లిరికల్ సాంగ్ గా బుధవారం రోజున విడుదలైంది. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటను హరిప్రియ, యాసిన్‌ నిసర్‌ లు పాడారు. ప్రేమికుల్ని అమితంగా ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.ఈ పాట విడుదలయ్యి 24 గంటలు కాకముందే 1 మిలియన్‌ వ్యూస్‌ని నమోదు చేసి రికార్డు సృష్టించింది.

ఈ పాట అలా వైరల్ అవుతుండంగానే.. నితిన్‌, కీర్తి సురేష్ ల ‘రంగ్‌దే’ చిత్రం నుండీ మరో మెలోడీ సాంగ్ విడుదలయ్యింది. దీనికి కూడా శ్రీమణి లిరిక్స్ అందించగా.. హరిప్రియ, కపిల్‌ కపిలన్‌ లు పాడారు. ఈ పాట కూడా విడుదలైన 24గంటలు కాకముందే 1 మిలియన్‌ వ్యూస్ ను నమోదు చేసింది.దీంతో ‘వింటేజ్ దేవి ఈజ్ బ్యాక్’ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘పుష్ప’ ఆల్బమ్ కూడా ఇదే స్థాయిలో ఉంటే.. దేవి శ్రీ ప్రసాద్ కు పూర్వ వైభవం వచ్చేసినట్టే..!

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus