రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు అంటే ఆ సినిమాకి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. మ్యూజిక్ తోనే సినిమా డిమాండ్ ను పెంచే కెపాసిటీ దేవి సొంతం. అయితే ఈ సంవత్సరం వచ్చిన పెద్ద సినిమాలు ‘వినయ విధేయ రామా’ ‘మహర్షి’ చిత్రాలకి దేవి ఆసించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదని కామెంట్స్ వినిపించాయి. ‘ఎఫ్2’ ‘చిత్రలహరి’ వంటి మీడియం సినిమాలకి మంచి మ్యూజిక్ నే ఇచ్చాడు దేవి. అయితే వాటి మ్యూజిక్ ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. చరణ్, మహేష్ వంటి స్టార్ హీరోల చిత్రాలకి మ్యూజిక్ కచ్చితంగా బాగుంది తీరాలి. అందుకే దేవి మ్యూజిక్ పై ఇప్పుడు ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
గత సంవత్సం ఇదే హీరోల సినిమాలు ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ చిత్రాలకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన దేవి… ఈ సంవత్సరం మాత్రం నిరాశ పరిచాడు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యాడు. ఈ ట్రోల్స్ చూసిన దేవిశ్రీ ప్రసాద్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఎక్కువ ప్రాజెక్టులు ఒప్పుకోవడం వలనే.. హీరోల సినిమాలనే స్టార్ హీరోల సినిమాలకి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సంగీతం ఇవ్వలేకపోయానని దేవి భావిస్తున్నాడట. దీంతో మీడియం రేంజ్ సినిమాల సంఖ్యను తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. ఇక పై స్టార్ హీరోల సినిమాలను మాత్రమే చేయాలనీ దేవి ఫిక్సయ్యాడని సమాచారం. ఇందులో భాగంగానే అఖిల్ 4 వ సినిమా నుండీ దేవి తప్పుకున్నాడని టాక్ వినిపిస్తుంది.