Waltair Veerayya: మెగా ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న దేవిశ్రీప్రసాద్!

పార్టీ సాంగ్స్‌.. సినిమాకు భలే కిక్‌నిస్తాయి. అప్పటివరకు కాస్త కూల్‌గా కనిపించిన సినిమా ఒక్కసారి హీటెక్కుతుంది. దానికి కారణం ఆ పాటలో కనిపించే స్పెషల్‌ అందం అయితే, ఇంకొకటి ఆ పాట ఫాస్ట్‌ బీట్‌. అయితే ఇలాంటి సాంగ్స్‌ లిరికల్‌ సాంగ్స్‌ ఆ సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్‌కి కిక్‌ ఇస్తాయి. ఇప్పుడు అలాంటి కిక్కే ఇవ్వడానికి ‘వాల్తేరు వీరయ్య’ సిద్ధమవుతున్నాడు. సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు దేవిశ్రీ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్న విషయం తెలసిందే. ఈ సినిమాకు పార్టీ సాంగ్‌ను ఇటీవల తెరకెక్కించారు. దానికి సంబంధించిన లిరికల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్‌ చేస్తారని గత కొద్ది రోజుల నుండి వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన వర్క్‌ పూర్తయిందని తెలియజేస్తూ డీఎస్పీ ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. అందులో మోనిటర్‌ మీద చిరంజీవి షిలౌట్‌ లాంటి బొమ్మ కనిపిస్తోంది. అక్కడ వివరాలు లేకపోయినా.. ‘బాస్ పార్టీ’కి రెడీ అవ్వండి అని మాత్రం టీజ్‌ చేశారు దేవిశ్రీ ప్రసాద్‌.

‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి సంక్రాంతికి సందడి చేయనున్న విషయం తెలిసిందే. బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రవితేజ నటిస్తున్నాడు. శ్రుతిహాసన్‌, కేథరిన్‌ లేడీ లీడ్స్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తారని సమాచారం. దీంతో ప్రచార పనుల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఈ పాటను విడుదల చేయనున్నారు.

‘‘బాస్‌ పార్టీ’కి సిద్ధంగా ఉండండి. ఈ వారంలోనే తొలి పాట విడుదలవుతోంది. ఇప్పుడే ఆ పాట చూశాను. మెగాస్టార్‌ ఎనర్జిటిక్‌ డాన్స్‌కి దిమ్మ తిరిగిపోయింది’’ అంటూ ఫ్యాన్స్‌ అంచనాలను పెంచేలా ట్వీట్‌ చేశారు దేవిశ్రీప్రసాద్‌. చిరు – ఊర్వశీ రౌతేలాపై ఓ ప్రత్యేక గీతం ఇటీవల చిత్రీకరించిన సంగతి తెలిసిందే. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. పాట విడుదలకు ముందు ఎలాగూ టీజర్‌ ఉంటుంది. అప్పుడు కాస్త, పాటలో ఇంకాస్త చూసి ఎంజాయ్‌ చేయడమే.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus