దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad).. టాలీవుడ్లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. చాలా మంది దర్శకనిర్మాతలకు ఇతను హాట్ ఫేవరెట్. దర్శకుల్లో చూసుకుంటే.. దేవి లేకుండా సుకుమార్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేసింది లేదు. రాజమౌళికి (S. S. Rajamouli) కీరవాణి (M. M. Keeravani) ఎలాగో.. సుకుమార్ కి (Sukumar) దేవి అలా అనమాట.ఈ కాంబోని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు అని ‘పుష్ప 2’ తో ప్రూవ్ అయ్యింది. హీరో, నిర్మాత..ల నుండి సంగీత దర్శకుడిని మార్చేయమని ఎంత ఒత్తిడి వచ్చినా దేవిని సుకుమార్ మార్చలేదు. ఇక ముందు కూడా మార్చడు అని కన్ఫర్మ్ అయిపోయింది.
మరోపక్క ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు నవీన్, రవి.లు నిర్మించిన ఎక్కువ సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది. వీరి కాంబినేషన్లో ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘రంగస్థలం’ (Rangasthalam) ‘చిత్రలహరి’ (Chitralahari) ‘ఉప్పెన’ (Uppena) ‘పుష్ప’ (Pushpa: The Rise) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) వంటి సినిమాలు వచ్చాయి. అంటే ఈ కాంబోలో ఇప్పటివరకు 8 సినిమాలు వచ్చాయి. సరిగ్గా గమనిస్తే అవన్నీ హిట్ సినిమాలే. కానీ ‘పుష్ప 2’ విషయంలో దేవికి, మైత్రికి గ్యాప్ వచ్చింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్ తో.. ఆ విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
ఆ ఈవెంట్లో మైత్రి రవిని ఉద్దేశించి స్టేజిపై ఓపెన్ అయిపోయాడు దేవి. ‘నాపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి’ అంటూ తన మనసులో ఉన్న బాధని అంతా కక్కేశాడు. దీంతో దేవి పై ‘మైత్రి’ అధినేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుగులో చేసే ఈవెంట్లో ప్రస్తావిస్తే పర్వాలేదు.. కానీ తమిళనాడులో జరిగిన ఈవెంట్లో రివీల్ చేయడంతో.. దేవి కామెంట్స్ అక్కడ కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో కోలీవుడ్లో కూడా అడుగుపెడుతుంది ‘మైత్రి’ సంస్థ. ఇలాంటి టైంలో.. అంటే మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే దేవి వాళ్ళపై కంప్లైంట్ చేయడం అనే అక్కడ చాలా చర్చలకు దారితీసింది. పైగా దేవి అక్కడ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ (Vijay Thalapathy) , అజిత్ (Ajith), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి స్టార్ హీరోలతో ఎప్పుడో పనిచేశాడు దేవి. అందువల్ల దేవి కామెంట్స్ అక్కడ బాగా వైరల్ అయ్యాయి.
దీంతో ‘మైత్రి’ నిర్మాతలు.. దేవిపై గుర్రుగా ఉన్నారట. ఈ బ్యానర్లో దేవి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా చేయాల్సి ఉంది. అది కనుక కంప్లీట్ అయిపోతే.. ఇక దేవిని పక్కన పెట్టేయాలని వాళ్ళు భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి.. ‘ఉస్తాద్’ నుండి కూడా దేవిని తీసేయాలని వాళ్ళు భావించారట. కానీ ప్రాజెక్టు మధ్యలో తీసేస్తే పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆగారట. సో ‘ఉస్తాద్’ తో దేవికి ‘మైత్రి’ ఫుల్స్టాప్ పెట్టే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.