Devil Movie: ‘డెవిల్’ కి ‘బింబిసార’ కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందా?

క‌ల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న నెక్స్ట్ మూవీ ‘డెవిల్’. ‘బింబిసార’ తో సాలిడ్ హిట్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత ‘అమిగోస్’ అనే మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఆ సినిమా కంటెంట్ పరంగా కొంత పర్వాలేదు అనిపించినా… కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. కానీ నిర్మాతలకు లాభాలను పంచింది. ఇప్పుడు చేస్తున్న ‘డెవిల్’ కూడా ఇంట్రెస్టింగ్ సినిమానే. విషయం ఏంటంటే..

దీనికి ‘బింబిసార’ కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందట. ఈ రోజు క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ వ‌దిలారు.నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను ‘బాబు బాగా బిజీ’ అనే సినిమా చేశాడు. అయినా సరే కథ నచ్చడంతో కళ్యాణ్ రామ్- అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ‘డెవిల్’ కి రూ.60 కోట్ల వరకు బడ్జెట్ అయ్యింది అని ఇన్సైడ్ టాక్. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇప్పటివరకు ‘బింబిసార’ మాత్రమే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ.

అయితే ఇప్పుడు ‘డెవిల్’ (Devil) ఆ సినిమాకంటే ఎక్కువ బడ్జెట్ అయినట్టు స్పష్టమవుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇందులో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఈ మూవీలో కనిపిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus