మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అయితే డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. 11వ రోజు కూడా కోటి పైనే షేర్ ను కలెక్ట్ చేసింది.ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
14.65 cr
సీడెడ్
5.76 cr
ఉత్తరాంధ్ర
3.71 cr
ఈస్ట్
1.53 cr
వెస్ట్
1.11 cr
గుంటూరు
1.57 cr
కృష్ణా
1.51 cr
నెల్లూరు
0.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
30.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.92 cr
ఓవర్సీస్
2.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
35.88 cr (షేర్)
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.35.88 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.15.18 కోట్ల లాభాలను అందించింది.
అవతార్ 2, 18 పేజెస్ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ ఇంత భారీగా కలెక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. 11వ రోజున ఈ మూవీ ఏకంగా రూ.1.5 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది.