మాస్ మహారాజ్ రవితేజ,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.అయితే 2022 డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్స్డ్ ను మూటగట్టుకుంది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి ఫుల్ రన్లో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 18.01 cr |
సీడెడ్ | 7.32 cr |
ఉత్తరాంధ్ర | 4.64 cr |
ఈస్ట్ | 1.91 cr |
వెస్ట్ | 1.30 cr |
గుంటూరు | 1.90 cr |
కృష్ణా | 1.79 cr |
నెల్లూరు | 1.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 37.87 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.57 cr |
ఓవర్సీస్ | 2.72 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 44.16 cr (షేర్) |
‘ధమాకా’ చిత్రానికి రూ.20.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.20.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.25 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.44.16 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.23.71 కోట్ల లాభాలను అందించింది. దీంతో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన మూవీగా రికార్డులకెక్కింది.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!