Bigg Boss 7 Telugu: నోరు జారిన థామినీ..! రెచ్చిపోయిన రతిక..! అసలు ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని మహాబలి టీమ్ చేయడంలో ఫైయిల్ అయ్యింది. అసలే రెండు ఛాలెంజస్ ఓడిపోయిన ఆ టీమ్ కనీసం యూనిటీగా ఉండి తమ పవర్ ద్వారా మాయాస్త్రాన్ని పంచడం లో కూడా విఫలం అయ్యారు. ముఖ్యంగా రతిక గేమ్ ఛేంజర్ అవ్వాలని అనుకుంది. ఈ క్రమంలో థామినీతో పెద్ద గొడవ వేసుకుంది. అలాగే, గౌతమ్ కి కూడా తన స్టైల్లో ఇచ్చిపారేసింది. సంచాలక్ అయిన సందీప్ మాటలు కూడా పట్టించుకోలేదు. పిచ్చి పట్టిన దానిలాగా తను పట్టుకున్న కుందేళ్లకి మూడేకాళ్లు అన్నట్లుగా మాట్లాడుతూ మంకు పట్టు పట్టి కూర్చుంది. దీంతో హౌసమేట్స్ అందరూ రతిక మాటలకి ఇరిటేట్ అయిపోయారు.

అయితే, ఇక్కడ రతిక అన్న మాటల్లో లాజిక్ లేకపోలేదు. తను లాస్ట్ లో వెళ్తే ఏం నష్టం అన్నదానికి టీమ్ మెంబర్స్ ఎవరి దగ్గరా కూడా సమాధానం లేదు. ఫస్ట్ లో అందరూ గ్రూప్ గానే డిస్కస్ చేస్కున్నారు. థామినీ ఫస్ట్ కూల్ గా కూర్చో నాకు గాబరాగా ఉంది అంటూ రతికని కూర్చోపెట్టి ఆర్గ్యూమెంట్ మొదలు పెట్టింది. లైవ్ లో అయితే చాలాసేపు వీళ్లిద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ అయ్యింది. గేమ్ పరంగా ఆలోచించాలి. ఇంకా ఇమ్యూనిటీ పరంగా ఆలోచించాలి అంటూ రతిక స్టార్ట్ చేసింది. ఫస్ట్ రతిక క్లియర్ గా శివాజీకి ఇమ్యూనిటీ ఇస్తే నామినేషన్స్ లో సేఫ్ అవ్వచ్చని క్లియర్ గా చెప్పింది.

అంటే ఇక్కడ తన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, శివాజీకి తనవల్ల ఇమ్యూనిటీ వస్తే తను 4వారాలు శివాజీ ఫ్యాన్స్ ఓట్లని గ్రాబ్ చేయచ్చు. కానీ , ఈవిషయాన్ని డైరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి తను శివాజీని సపోర్ట్ చేస్తానని చెప్పింది. అంతకు ముందు టేస్టీ తేజ తను ప్రిన్స్ పేరు చెప్పాడు. అలాగే థామినీ షకీలమ్మకి సపోర్ట్ చేస్తానని చెప్పింది. దీంతో తను లాస్ట్ లో ఓటు వేయకపోతే గేమ్ చేంజర్ అవ్వలేనని భావించి రతిక మంకుపట్టు పట్టింది. డిస్కషన్స్ లో థామిని 4వ ప్లేస్ లో వెళ్తే శివాజీ నుంచీ తీసుకుని షకీలమ్మకి ఇస్తానని క్లియర్ గా చెప్పింది.

నా రీజన్ నాకుంది అంటూ మాట్లాడింది. ఈ మాటలు రతిక మైండ్ లో పాతుకుపోయాయి. అయితే, గౌతమ్ చాలా క్లియర్ గా నేను శివాజీ లేదా ప్రిన్స్ కి ఇస్తానని చెప్పేశాడు. లాస్ట్ లో గౌతమ్ వెళ్తే జరిగేది ఇదే అని రతిక ఊహించుకుంది. అప్పుడు టేస్టీ తేజ రతికకి గట్టిగా చెప్పడు. 2వ సారి ప్రశాంత్, 3 నువ్వు , 4 థామిని , 5 గౌతమ్, 6 నేను ఫిక్స్ అన్నాడు. దీనికి ముందు తలూపినా కూడా రతిక తర్వాత ఆర్గ్యూమెంట్ కి దిగింది. ఇంతులో థామినీ కలగజేసుకుని మాట్లాడుతూ కెప్టెన్ గా నేను డిసైడ్ చేస్తున్నా వెళ్లు అంది.

దీనికి రతికకి కాలింది. నువ్వు కెప్టెన్ ఎప్పుడు అయ్యావ్ చెప్పూ అంటూ వాదనకి దిగింది. నువ్వు వాయిస్ రైజ్ చేస్తే నేను కూడా చేస్తా అంటూ రెచ్చిపోయి అరిచింది. టీఆర్పీ కోసం చేయద్దంటూ థామినీ కూడా కౌంటర్ ఎటాక్ చేసింది. దీంతో మాటకి మాట అనుకుంటూ ఇద్దరూ రెచ్చిపోయారు. ఇక గ్రూప్ టాస్క్ లో ఇన్ పుట్స్ ఏమిచ్చావ్ అని థామినీ అడిగితే రతిక ట్రిగ్గర్ అయిపోయింది. వాయిస్ రైజ్ చేస్తే నీకంటే ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తా అంటూ థామిని పైకి వెళ్లింది.

చైల్డిష్ గా బిహేవ్ చేస్తోందని అస్సలు మాట వినట్లేదని థామినీ బెడ్ రూమ్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ కి చెప్తూ బాధపడింది. సేది లేక తను మూడో పొజీషన్ కి వెళ్లి తను అనుకున్నట్లుగానే షకీలకి స్పిన్నర్ ఇచ్చింది థామిని. ఇద్దరూ ఆ తర్వాత కూడా గార్డెన్ ఏరియాలో వాదన పెట్టుకున్నారు. మరి ఈవిషయం వీకండ్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు. వాళ్లిద్దరినీ ఎలా కలుపుతారు అనేది ఆసక్తికరం.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus