Dhanush: మాజీ భార్యపై ధనుష్ స్పెషల్ ట్వీట్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ నటుడు ఇటీవల తన భార్యకు విడాకులు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రజినీకాంత్ కూతురైన ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్ 18 తరువాత వివాహ బంధానికి తెగతెంపులు చేసుకుని విడాకులు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆ విషయం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంకా అనేక రకాల అనుమానాలు వస్తూనే ఉన్నాయి.

Click Here To Watch NEW Trailer

అసలు ఎందుకు వారిద్దరు విడిపోయారు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉందా లేదా అని చాలామంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ధనుష్ తన భార్య పై ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ భార్య ఐశ్వర్య ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను డైరెక్ట్ చేయడంతో ధనుష్ కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు. ‘పయని’ అనే ఆ వీడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాకుండా గాడ్ బ్లెస్స్ యు అని స్పందించాడు. ధనుష్ ఆ విధంగా వివరణ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక తన విడాకులు ఇచ్చినప్పటికీ కూడా ఐశ్వర్య మాత్రం ఇంకా ట్విట్టర్ నుంచి ధనుష్ పేరును తొలగించలేదు. ఇక వీరు మళ్ళీ కలిస్తారు అని వార్తలు కూడా తమిళ ఇండస్ట్రీలో చాలానే వస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా మరొకసారి మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

అయితే ధనుష్ ఐశ్వర్య మాత్రం ఇద్దరు స్నేహపూర్వకంగా మాట్లాడుకుని విడిపోయినట్లు గా తెలుస్తోంది. ధనుష్ హఠాత్తుగా భార్యకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో మరోసారి వీరి బంధం పై అనేక రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. ఇక రజనీకాంత్ అభిమానులు మాత్రం ధనుష్ నిర్ణయం కరెక్ట్ కాదు అంటూ ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మరొకసారి దాంపత్య జీవితం గురించి ఆలోచించాలి అని సలహాలు ఇస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus