Dhanush: ధనుష్ క్యాస్టూమ్స్ ఖర్చు అంత తక్కువా?

స్టార్ హీరో ధనుష్ కు మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన టాలెంట్ తో ధనుష్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే ఈ హీరో రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. ఫంక్షన్లు, ఈవెంట్లకు జిగేల్ జిగేల్ మనే డ్రెస్సులు వేసుకోవడానికి ఈ స్టార్ హీరో పెద్దగా ఆసక్తి చూపరు.

సినిమాలలో కూడా ఈ హీరో డ్రెస్సింగ్ సింపుల్ గానే ఉంటుందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు కేవలం క్యాస్టూమ్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్టార్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ కు ఈ మొత్తం అదనం కావడం గమనార్హం. అయితే ధనుష్ క్యాస్టూమ్స్ ఖర్చు మాత్రం కేవలం ఎనిమిది లక్షల రూపాయలుగా ఉంది. పాన్ ఇండియా హీరో అయినప్పటికీ ధనుష్ మాత్రం క్యాస్టూమ్స్ కోసం తక్కువ మొత్తమే ఖర్చు చేస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ధనుష్ కు జోడీగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఎంపికయ్యారు. భీమ్లా నాయక్ లో రానాకు జోడీగా నటిస్తున్న సంయుక్త మీనన్ వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. తెలుగులో సంయుక్త మీనన్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. ధనుష్ నటిస్తున్న సినిమాకు తెలుగులో ‘సార్‌’ అనే టైటిల్ ఫిక్స్ కాగా ఈ సినిమాతో తెలుగులో ధనుష్ కు మార్కెట్ పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus