కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. 40 ఏళ్ల వయసులో యూత్ ఐకాన్ అవార్డ్ అందుకున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘దక్షిణ్ 2023’ పేరుతో రెండు రోజుల పాటు చెన్నైలో జరిగిన సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్ ముగింపు వేడుక గురువారం రాత్రి జరుగగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘యూత్ ఐకాన్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ధనుష్ మాట్లాడుతూ..
40 యేళ్ళ వయసులో యూత్ ఐకాన్ అవార్డు అందుకోవడం మరిన్ని చిత్రాలు చేసేలా ప్రోత్సహిస్తుందన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రుల కృషి ఉందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. వినోద పరిశ్రమ వ్యాపారం ప్రస్తుతం 30 బిలియన్లుగా ఉందని, వచ్చే 2030 నాటికి ఇది 70 బిలియన్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వృద్ధిలో ఓటీటీ, డిజిటల్ అడ్వర్‌టైజింగ్‌ల భాగస్వామ్యం మూడో వంతుగా ఉందన్నారు.
ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్నది భారత్ అని చెప్పారు. కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించిందన్నారు. అందుకే సినిమాలు, క్రీడలకు సరిహద్దులు లేవన్నారు. మంచి కథాంశాలతో కూడిన సినిమాలు తీస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు. చిత్రపరిశ్రమలో ఒకవైపు సవాళ్ళు, అవకాశాలు, మరోవైపు ఎక్కువ మంది వ్యక్తులకు ఎలా నైపుణ్యం కల్పించాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎలా చిత్రాలు నిర్మించాలన్న అంశంపై విస్తృతంగా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు.
భారతీయ చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాగా సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్‌లో ‘ఐకాన్’ అవార్డును అందుకోవాల్సిన మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సదస్సులో ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్, దర్శకుడు ఆర్.కె.సెల్వమణి, సినీ నటీమణులు ఖుష్బూ, శోభన, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?