‘మిషన్ 2020’ టీమ్‌కు అభినందనలు తెలిపిన ‘దర్జా’ మూవీ టీమ్

హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన జీవిత సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. గతంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మెంటల్ పోలీస్’, ‘ఆపరేషన్ 2019’ సినిమాలను తెరకెక్కించిన కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకుడు.

అక్టోబర్ 29 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ‘దర్జా’ మూవీ టీమ్ పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపింది. శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి శివశంకర్ పైడిపాటి నిర్మాత.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ‘దర్జా’ మూవీ టీమ్ శుక్రవారం ‘మిషన్ 2020’ చిత్రాన్ని చూశారు. సినిమా నచ్చడంతో వెంటనే ‘మిషన్ 2020’ టీమ్‌ని శాలువాలతో సత్కరించి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ‘దర్జా’ మూవీ ప్రొడ్యూసర్ శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మిషన్ 2020 చిత్రాన్ని చూశాము. చాలా బాగా నచ్చింది. యూత్ అంతా తప్పని సరిగా చూడాల్సిన చిత్రమిది. మెసేజ్ అనే కాదు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. డైరెక్టర్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. క్లారిటీగా.. చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించారు. వారికి ముందుగా మా అభినందనలు.

అలాగే ఇలాంటి స్టోరీ వినగానే మాములుగా అయితే నిర్మాతలు ఆలోచిస్తారు. ఇలాంటి సినిమా తీయవచ్చా? లేదా? అని. కానీ అలాంటిదేమీ పట్టించుకోకుండా ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఇంక సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్ ఇచ్చిన ఆర్ఆర్ మాములుగా లేదు. ఆయనే మా ‘దర్జా’ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అతనికి స్పెషల్‌గా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాము. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూడాలి. 8వ తరగతి, ఆ పైన చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరూ తప్పక ఈ చిత్రాన్ని చూడండి. మరొక్కసారి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నాము..’’ అన్నారు.

సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీకే థియేటర్స్ పెరిగాయి. ఇది చాలు సినిమా సక్సెస్ గురించి చెప్పడానికి. మార్నింగ్ నుండి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నా లైఫ్‌లో ఇన్ని కాల్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. మా సినిమా చూసి ‘దర్జా’ మూవీ టీమ్ ఇంత గొప్పగా సత్కరించి, అభినందించినందుకు వారికి ధన్యవాదాలు. మేము ఎలాంటి సక్సెస్‌ని అయితే ఊహించామో.. అలాంటి సక్సెస్‌ని ప్రేక్షకులు ఇచ్చారు.

ఇంత స్ట్రాంగ్ పాయింట్‌ని ఇన్ డైరెక్ట్‌గా కాకుండా డైరెక్ట్‌గా చెప్పే ధైర్యం దర్శకుడు కరణం బాబ్జిగారికే ఉంది. ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. పేరేంట్స్ కొన్ని విషయాలను పిల్లలకు డైరెక్ట్‌గా చెప్పలేరు. ఇలాంటి సినిమాలు చూపించడం ద్వారా అలాంటి విషయాలు చెప్పిన వారవుతారు. ఈ సినిమాని మీ పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని చూపించండి. పిల్లలకు, పేరేంట్స్‌కు ఈ సినిమా అవసరం.

ఈ సినిమాకు సెన్సార్ వారు ఇచ్చిన సపోర్ట్‌ని మరిచిపోలేం. ఎంతో సపోర్ట్ అందించారు. వారందరికీ మా టీమ్ తరపున ధన్యవాదాలు. అలాగే ధైర్యంగా ఈ చిత్రాన్ని నిర్మించిన మా నిర్మాతల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక మంచి మెసేజ్‌ని సమాజానికి ఇచ్చే కార్యక్రమంలో వారందించిన సపోర్ట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎవరికీ భయపడలేదు వారు. వారికి థ్యాంక్యూ. ఈ టీమ్‌తో మరిన్ని మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నాను..’’ అని అన్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus