ధర్మయోగి

తమిళ స్టార్ హీరో ధనుష్‌, త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కోడి’ చిత్రం నిన్న తమిళంలో భారీ ఎత్తున విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ధర్మయోగి'(ది లీడర్) పేరుతో నేడు విడుదల చేస్తున్నారు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మరి తెలుగులో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకోనుందో, తెలుగు ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూద్దామా!

కథ : యోగి మరియు ధర్మ(ధనుష్ ద్విపాత్రాభినయం)లు అన్నదమ్ములు. ఒకే పోలికతో ఉన్న వీరిద్దరి స్వభావాలు మాత్రం చాలా డిఫరెంట్. యోగికి చాలా కోపం ఎక్కువ. ముక్కుసూటి మనస్తత్వం కలవాడు. ధర్మ మాత్రం చాలా సాఫ్ట్. తల్లిచాటు బిడ్డగా పెరుగుతాడు. యోగి అనుకోకుండా తన తండ్రి మరణాంతరం రాజకీయ నాయకుడిగా మారుతాడు. రుద్ర(త్రిష)తో ప్రేమలో పడతాడు యోగి. ధర్మ ఓ ప్రొఫెసర్ గా పనిచేస్తుంటాడు. మాలతి(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు ధర్మ. ఇదిలా వుండగా రుద్ర వలన యోగి జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. తర్వాత ఏం జరిగింది? అసలు రుద్ర ఎవరు? రుద్ర వలన యోగి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ అన్నదమ్ముల కథలు చివరకు ఏమయ్యాయి? మరి యోగి తాను అనుకున్న దానిని దక్కించుకున్నాడా లేదా అనేది వెండితెర మీద చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : ధనుష్ రెండు వేరియేషన్స్ పాత్రలలో అధ్బుతంగా నటించాడు. యోగి పాత్రలో ఒక గర్వం, ఉక్రోషం, పొగరున్న రాజకీయ నాయకుడిగా మెప్పించాడు. బాడీ లాంగ్వేజ్ బాగా సెట్ అయ్యింది. అలాగే ధర్మ పాత్రలో తన సింపుల్ నటనతో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రలకు ఉన్న వేరియేషన్స్ బాగా చూపించారు. రుద్ర పాత్రలో త్రిష నటన బాగుంది.
త్రిష పొలిటికల్ లీడర్ గా తనలోని కొత్త నటిని ప్రజెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ నెగెటివ్ పాత్రలో త్రిష పెద్దగా ఆకట్టుకోలేదు. ధనుష్-త్రిషల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ధర్మకి జోడి మాలతిగా నటించిన అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు తగిన న్యాయం చేసింది. కాస్త అల్లరి పిల్లగా కనిపిస్తూనే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా అనుపమ డైలాగ్స్ బాగున్నాయి. ధనుష్-అనుపమల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. వీరిద్దరి జోడి బాగా సెట్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పరవాలేదనిపించారు. సినిమా అంతా కూడా లవ్, కామెడి, యాక్షన్ ఎంటర్ టైనర్ తో సాగుతూ ఉంటుంది. భారీగా యాక్షన్ సీన్లు ఇష్టపడని ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త బోర్ కలిగించవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు : ఈ సినిమాకు వెంకటేష్.ఎస్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లోకేషన్లలో చిత్రీకరించారు. ధనుష్ ను రెండు వేరియేషన్స్ లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా చక్కగా చూపించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ పరవాలేదు. డైలాగ్స్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ గా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ సక్సెస్ అయ్యాడు. సింపుల్ స్టొరీ లైన్ ను చాలా చక్కగా ప్రజెంట్ చేసాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి మార్కులు కొట్టేసాడు. ధనుష్ నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ : ‘ధర్మయోగి’ చిత్రం కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. మాస్ ప్రేక్షకులతో పాటు కొంచెం లవ్ స్టొరీలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. మొత్తానికి ‘ధర్మయోగి’ చిత్రం ఒకసారి చూడవచ్చు.

Rating : 2.5/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus