మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఢీ’. దివంగత నటుడు శ్రీహరి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ‘సిరి వెంకటేశ్వర ఫిలింస్’ బ్యానర్ పై మల్లిడి సత్యనారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. మంచు విష్ణు కెరీర్లో 5వ సినిమా ఇది. 2007 వ సంవత్సరం ఏప్రిల్ 13న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
కోన వెంకట్, గోపి మోహన్ ల పంచ్ డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, శ్రీను వైట్ల దర్శకత్వం కలగలిపి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
4.21 cr
సీడెడ్
1.57 cr
ఉత్తరాంధ్ర
1.02 cr
ఈస్ట్
0.56 cr
వెస్ట్
0.57 cr
గుంటూరు
0.68 cr
కృష్ణా
0.62 cr
నెల్లూరు
0.46 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
9.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
11.04 cr
‘ఢీ చిత్రానికి’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.11.04 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.6.04 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది. దీంతో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విష్ణు కెరీర్లో మొదటి కమర్షియల్ హిట్ మూవీ ఇదే అని చెప్పాలి. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ శాటిలైట్ హక్కులని అమ్మడంతో నిర్మాతకి మంచి లాభాలు దక్కాయి.