బిగ్ బాస్ హౌస్ ని కమాండెంట్ హౌస్ గా మార్చాడు బిగ్ బాస్. ఇందులో కెప్టెన్ గా అఖిల్ ని పెడుతూ, మిగతా హౌస్ మేట్స్ ని కమాండెంట్స్ గా కొన్ని చాలెంజస్ చేయమన్నాడు. ఎవరైతే ఫస్ట్ బజర్ సౌండ్ వినగానే బజర్ ని ప్రెస్ చేస్తారో వారు ఛాలెంజస్ ని ఎదుర్కోవాలి. అలా ఛాలెంజ్ ని సక్సెస్ ఫుల్ గా చేస్తే హౌస్ మేట్ కి ఒక స్టార్ వస్తుంది.ఫస్ట్ స్పీడ్ గా బజర్ కొట్టిన సోహైల్ తీస్కున్న ఛాలెంజ్ లో విఫలం అయ్యాడు. తర్వాత అఖిల్ – అభిజిత్ లు ఛాలెంజెస్ ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక తర్వాత హారిక స్పీడ్ గా వెళ్లి బజర్ కొట్టింది.
గార్డెన్ ఏరియాలో ఉన్న టైర్ ని 10 రౌండ్స్ తోయాలి. దీనికి కేవలం 15 నిమిషాలు మాత్రమే లభిస్తుందని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడే హారిక అంత పెద్ద టైర్ తోయగలదా అని చాలామంది అనుకున్నారు. కానీ తన శక్తి ఏంటో నిరూపించింది. దేత్తడి హారిక అల్లాడించింది. 10 రౌండ్లని కేవలం 9 నిమిషాలకంటే తక్కువ టైమ్ లో చేసి శభాష్ అనిపించుకుంది. స్టార్ ని దక్కించుకుంది.
అంతేకాదు, ఇప్పుడు కెప్టెన్సీ రేస్ లో ఎక్కువసార్లు పార్టిసిపేట్ చేసే మొట్టమొదటి వ్యక్తి హారికే అవుతుంది. ఇప్పటివరకూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో ద బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చింది హారిక. అంతేకాదు, ఇప్పుడు టాప్ -5 పై కూడా కన్నేసింది. హారిక గేమ్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా టైటిల్ ఫేవరెట్ అవుతుంది అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అదీ మేటర్.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!