Ajay Bhupathi: మంగళవారం డైరెక్టర్.. ఆశ చూపి హ్యాండ్ ఇచ్చిన హీరో?

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో ఘనవిజయం అందుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) తర్వాత ‘మహా సముద్రం’  (Maha Samudram)  సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ఇక ఆ తరువాత ‘మంగళవారం’ (Mangalavaaram)  సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ భూపతి ఇటీవల చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌తో ఒక పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై చాలా అంచనాలు ఉన్నప్పటికీ, పలు చర్చల తర్వాత కూడా సెట్స్ పైకి వెళ్ళకపోవడం విచారకరం.

Ajay Bhupathi

మొదట కథకు ధృవ్ ఓకే చెప్పినప్పటికీ, ఏ కారణం చేతనో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఫుల్ స్క్రిప్ట్ పై అతను సంతృప్తి చెందలేదనే టాక్ అయితే వస్తోంది. ఇక ఈ సినిమా ఎందుకు నిలిచిపోయిందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. స్టోరీలో మార్పుల గురించి చర్చలు జరిగాయట, కానీ చివరికి ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం.

దీనితో అజయ్ భూపతి ఇప్పుడు కొత్త హీరోని వెతుక్కుంటూ తన కథను ముందుకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎవరు సెట్టవ్వక పోతే అజయ్ భూపతి ‘మంగళవారం’ సీక్వెల్ ని మొదలుపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అజయ్ భూపతి టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నా, ఆయన సినిమాలకు మధ్య పెద్ద గ్యాప్ తీసుకోవడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.

మంచి కథా రచనతో కూడిన సినిమాలు తీసినప్పటికీ, పెద్ద స్టార్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం ఇంకా దొరకకపోవడం లేదు. ఒక సాలీడ్ హిట్ పడితేనే అతనికి అవకాశాలు పెరుగుతాయి. ఇదిలా ఉంటే, ధృవ్ విక్రమ్ ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బిసన్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో ధృవ్ కి జోడీగా నటిస్తుందని సమాచారం.

‘వేట్టయన్‌’ ఎఫెక్టా? మణిర్నతం సినిమా నిజంగానే అనుకోలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus