Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?
- March 23, 2026 / 10:08 AM ISTByPhani Kumar
మార్చి 19న విడుదలైన ‘దురంధర్ : ది రివేంజ్'(Dhurandhar: The Revenge) అదే ‘దురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తోంది. తొలి 4 రోజుల్లోనే రూ.500 మార్క్ కి చేరువైంది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dhurandhar: The Revenge
ఇప్పటివరకు ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా ‘దంగల్’ నిలిచింది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.2200 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి.. ‘దురంధర్ 2’ ‘దంగల్’ వసూళ్ళను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ ‘దురంధర్ 2’ ఆ ఫీట్ సాధిస్తే రాజమౌళి, మహేష్ బాబు..ల ‘వారణాసి’ సినిమాకి పెద్ద సవాలు విసిరినట్టే. ఎందుకంటే.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా అదే. అల్మోస్ట్ రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘దురంధర్’ ‘దురంధర్ 2’ సినిమాలు రెండు భాగాలు కలుపుకొని రూ.600 కోట్ల బడ్జెట్లో పూర్తయ్యాయి. ‘దురంధర్’ సినిమా ఆల్రెడీ రూ.1400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ‘దురంధర్ 2’ రూ.2000 కోట్ల మైలు రాయిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
అలాంటప్పుడు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తోన్న ‘వారణాసి’ కచ్చితంగా రూ.2000 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేయాలి. రాజమౌళి సినిమాలు కచ్చితంగా భారీ వసూళ్లు సాధిస్తాయి. కానీ గత చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ … ‘బాహుబలి 2’ వసూళ్ళనే అధిగమించలేకపోయింది. అందుకే ‘వారణాసి’ పై కూడా చాలా అనుమానాలు ఏర్పడ్డాయి. పైగా ‘వారణాసి’ సినిమా పక్కనే ప్రభాస్ ‘స్పిరిట్’, అల్లు అర్జున్- అట్లీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని వినికిడి.
ప్రభాస్, అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్లు. ‘వారణాసి’ వసూళ్ళపై వాళ్ళ సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. మరి ఇన్ని అడ్డంకులు దాటుకుని ‘వారణాసి’ రూ.2000 కోట్ల మైలు రాయిని దాటడం అనేది అంత చిన్న వ్యవహారం ఏమీ కాదు.
కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి
















