రొమోయో చనిపోతాడు.. మనం అలా కాదు

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలలో రాధేశ్యామ్ ఒకటి. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఒక విధంగా సినిమా అప్డేట్స్ ఆలస్యంగా వస్తుండడంలో అభిమానుల్లో ఒక అసహనం అయితే ఉంది. ఇక డార్లింగ్ ప్రభాస్ కు సంబంధించిన చిన్న లుక్ వదిలినప్పుడు ఎప్పటిలానే వైరల్ అవుతున్నాయి.అయితే ప్రస్తుతం అందరిచూపు టీజర్ పైనే ఉంది.

ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న టీజర్ కు సంబంధించిన డైలాగ్స్ కొన్ని ముందే లీక్ అయ్యాయి. విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్న ప్రభాస్ ఇటాలియన్ డైలాగ్స్ తో టీజర్ స్టార్ట్ అవుతుందట. ఇక పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆమె వేసే పొగరైన ప్రశ్నకు ప్రభాస్ చెప్పే సమాధానం పవర్ఫుల్ గా ఉంటుందట.

ప్రేరణ: నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నవా?
విక్రమాదిత్య: ప్రేమ కోసం రోమియో చనిపోయాడు, మనం అలా కాదు..

ఈ విధంగా ఇద్దరి మధ్య ప్రేమగా సంభాషణ జరుగుతుందని తెలుస్తోంది. మరి ఈ డైలాగ్స్ టీజర్ లో ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఇక రొమాంటిక్ లవ్ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక సమ్మర్ ఏండింగ్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus