Chiranjeevi: చిరంజీవితో సన్నాఫ్‌ ఇండియా డైరక్టర్‌ సినిమా… నిజమేనా?

డిజాస్టర్‌ సినిమా ఇచ్చాక.. మళ్లీ ఆ డైరక్టర్‌కి సినిమాలు రావడం అంత ఈజీనా అంటే చాలా కష్టం అనే చెప్పాలి. అందులోనూ స్టార్‌ హీరోతో సినిమా అంటే ఇంకా కష్టం అనొచ్చు. అయితే టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఇలాంటి అవకాశాలు ఇస్తున్న హీరోలు కొందరు ఉన్నారు. వారిలో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. మెహర్‌ రమేశ్‌తో ‘భోళా శంకర్‌’ సినిమా చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌కి అవకాశం ఇస్తా అన్నారు కూడా. అదవ్వలేదు కానీ.. ఇప్పుడు వేరే డైరక్టర్‌కు ఇలానే మాటిచ్చారట.

ఈ విషయాన్ని ఆ డైరక్టరే చెప్పారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి కామెడీ సినిమాలతో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు డైమండ్ రత్నబాబు. ఆ సినిమాల తరవాత ఆయన దర్శకుడిగా మారారు. ఆది హీరోగా ‘బుర్రకథ’ అనే సినిమా తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్‌ అవ్వలేదు. అయితే డైరక్షన్‌ గురించి మంచి ఫీడ్‌ బ్యాకే వచ్చింది. ఆ తర్వాత ఆయన ఏకంగా మోహన్‌బాబు లాంటి నటుడితో సినిమా చేసే ఛాన్స్‌ సంపాదించారు.

అదే ‘సన్నాఫ్‌ ఇండియా’. ఈ సినిమా ఫలితం గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. అంతలా నిరాశపరిచారు. అయితే దానికి చాలా కారణాలున్నాయి. ఇప్పుడు రత్నబాబు మెగాస్టార్‌తో సినిమా అంటున్నారు. ఇటీవల చిరంజీవి స్టోరీ లైన్‌ చెప్పానని, త్వరలో సినిమా చేద్దాం అన్నారని రత్నబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రత్నబాబు విజె సన్నీతో తీసిన ‘అన్‌స్టాపబుల్‌ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 9న థియేటర్లలో విడదలకు సిద్ధమవుతోంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో రత్నబాబు ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టారు. అందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం వెల్లడించారు. ‘‘చిరంజీవిని కలిసి ఒక కథ చెప్పాను. విని ప్రశంసించారు కూడా. చిరంజీవి స్థాయికి వెళ్లే సినిమాలు చేయాలి. చేస్తే ఆయన కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని రత్నబాబు చెప్పారు. అయితే అది ఇప్పటికే చెప్పిన కథనా, లేక కొత్త కథనా అనేది కాలమే చెబుతుంది. అయితే (Chiranjeevi) చిరంజీవికి కథ చెప్పి ఒప్పించడం అంత ఈజీ కాదనే విషయం గుర్తుంచుకోవాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus