బిగ్ బాస్ హౌస్ లో కుటుంబసభ్యుల ఆత్మీయ పలకరింపు కోసం హౌస్ మేట్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇది అన్ని సీజన్స్ లో కూడా జరిగేదే. అయితే , ఈసారి కాస్త ముందురగా ఈ ఎపిసోడ్ ని పెట్టింది బిగ్ బాస్ టీమ్. ఇందులో భాగంగా మోనాల్ మదర్ పంపిన వాయిస్ విని మోనాల్ విపరీతంగా ఆవేదన చెందింది. తనవాళ్లు ఇంక రారు అనుకుని బాత్రూమ్ లోకి వెళ్లి మరీ ఏడ్చింది. ఇది చాలా అన్యాయం బిగ్ బాస్ అంటూ తన బాధని కెమెరా ముందుకొచ్చి వెళ్లగక్కుకుంది.
కాసేపట్లోనే మోనాల్ అక్క హేమాలి వచ్చి మోనాల్ ని పలకరించింది. దాంతో మోనాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు, హేమాలి వచ్చి అందరికీ కాస్త బుద్దులు చెప్పింది. అఖిల్ గురించి నా గురించి బయట చెడుగా మాట్లాడుకుంటున్నారా అని మోనాల్ అడిగినపుడు, అదేం లేదు.. నువ్వేమీ పట్టించుకోకుండా గేమ్ ఆడు.. మీరిద్దరూ మంచి స్నేహితులు అని చెప్పింది. తర్వాత నువ్వు విన్నర్ అని అనుకోని గేమ్ ఆడు.. నువ్వే విన్నర్ అవుతావ్ అంటూ మాట్లాడింది.
ఇక్కడే అభిజిత్ తో మాట్లాడినపుడు ఎలా ఉన్నావ్ అంటూనే కొన్ని సలహాలు ఇచ్చింది. వెనకాల మాట్లాడకుంటా ముందరే మాట్లాడు ఏదైనా సరే అని చెప్పింది. అది మంచి అయినా, చెడు అయినా ఏది అయినా సరే మాట్లాడేసేయ్ అంటూ చెప్పేసరికి అభిజిత్ కాస్త హర్ట్ అయ్యాడు.
వెళ్లిపోతూ అభిజిత్ తో మాట్లాడుతూ మీరు ఇప్పుడు బాగా ఆడుతున్నారు గేమ్ మంచిగా ఆడుతున్నారు. కానీ మోనాల్ తో ఎక్కువగా మాట్లాడట్లేదు అదే నాకు నచ్చలేదు అన్నట్లుగా చెప్పింది. దీనికి అభిజిత్ ఎక్కువగా మాట్లాడానా మోనాల్ తో అంటూ అడిగాడు. మొత్తానికి హేమాలి వచ్చి ఒక మంచువర్షం కురిపించి వెళ్లిపోయిందనే చెప్పాలి.
Most Recommended Video
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!