‘ఆర్ఆర్ఆర్’ డేట్ ను లాక్ చేశారా..?

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే సినిమా క్లైమాక్స్ షూట్ మొదలైందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. కానీ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కొందరేమో ఈ ఏడాది దసరాకు సినిమా రిలీజ్ అవుతుందని అంటుంటే.. మరికొందరు వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా వస్తుందని అంటున్నారు.

ఇలాంటి సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోన్న ఓ నటి ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానున్నట్లు పోస్ట్ పెట్టి సంచలనం రేపింది. కానీ తన పొరపాటుని గ్రహించి వెంటనే పోస్ట్ ను డిలీట్ చేసింది. కానీ ఇంతలోనే ఆ పోస్ట్ ని వైరల్ చేశారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ నటి ఎవరంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో నెగెటివ్ రోల్ లో నటిస్తోన్న ఐరిష్ బ్యూటీ అలిసన్ డూడీ. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన అలిసన్.. రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

ఆమెది మిసెస్ స్కాట్ పాత్ర. కొన్ని నెలల ముందు నుండే అలిసన్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో పాల్గొంటుంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఆమెకి ఎవరు సమాచారం ఇచ్చారో కానీ.. అత్యుత్సాహం ప్రదర్శించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసింది. ఈ పోస్ట్ తొలగించినప్పటికీ.. సినిమా దసరా కానుకగా రావడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus