Sankranthiki Vasthunnam: వెంకీ భార్య నీరజ స్ఫూర్తితో అనిల్ రావిపూడి ఆ సీన్లు రాసుకున్నాడా?

విక్టరీ వెంకటేష్ (Venkatesh)  హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. భీమ్స్(Bheems Ceciroleo)  ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sankranthiki Vasthunnam

కచ్చితంగా సంక్రాంతి విన్నర్ గా నిలిచే సినిమా ఇదే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వెంకటేష్ కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కొన్ని సన్నివేశాలు వెంకటేష్ నిజ జీవితం నుండి తీసుకున్నారట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. విషయంలోకి వెళితే.. ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)..లు భార్యభర్తలుగా నటించారు.

వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయట. కొంచెం నవ్విస్తాయి.. అలాగే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాయట. ఐశ్వర్య రాజేష్ తో కలిసి హీరో వంట చేసే సన్నివేశాలు, బెస్ట్ ఫ్రెండ్స్ గా హీరో తన భార్యతో కబుర్లు చెప్పుకోవడం వంటివి.. ఉంటాయట. అవి వెంకటేష్ నిజ జీవితం నుండి తీసుకున్నారని తెలుస్తుంది.

‘భార్య నీరజని తన బెస్ట్ ఫ్రెండ్ గా భావిస్తానని, తనతో కలిసి ఎక్కువగా కబుర్లు చెప్పుకుంటానని, అలాగే కలిసి వంట కూడా చేస్తానని’ ఇటీవల అన్ స్టాపబుల్ షోలో వెంకటేష్ చెప్పుకొచ్చాడు. వెంకటేష్ కుటుంబ సభ్యులు చాలా మంది.. వీళ్ళని ఆదర్శ దంపతులు అంటుంటారట.’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్రని వెంకటేష్ భార్య నీరజ స్ఫూర్తితో తీసుకున్నారని స్పష్టమవుతుంది.

సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌… అల్లు అర్జున్‌ గురించేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus