Trivikram: ‘గుంటూరు కారం’ కి రిలేట్ అవుతున్న త్రివిక్రమ్ కామెంట్స్.!

త్రివిక్రమ్  (Trivikram) – మహేష్ బాబు (Mahesh Babu)  కాంబినేషన్లో ‘అతడు’  (Athadu) ‘ఖలేజా’ (Khaleja) వంటి క్లాసిక్స్ తర్వాత ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే సంక్రాంతి సెలవులు.. మహేష్ బాబు, త్రివిక్రమ్..లకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించింది. సో అభిమానులు, మహేష్ బాబు బాగానే డ్యూటీ చేశారు. కానీ ఎటొచ్చి..

Trivikram

కంటెంట్ పరంగా దర్శకుడు త్రివిక్రమ్ నిరాశపరిచాడు అనేది వాస్తవం. ‘గుంటూరు కారం’ రిలీజ్ తర్వాత త్రివిక్రమ్.. కొన్నాళ్ల పాటు బయట కనిపించింది లేదు. ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సక్సెస్ మీట్ కి వచ్చినా.. అక్కడ త్రివిక్రమ్ పెద్దగా మాట్లాడింది లేదు. అయితే ఈరోజు ‘జిగ్రా’  (JIGRA) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ హాజరయ్యాడు. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ చాలా హుషారుగా కనిపించాడు. కాసేపు సినిమా గురించి మాట్లాడిన తర్వాత..’జీవితంలో అంతా సహజంగానే జరగాలని ఎప్పుడూ కోరుకుంటాను.

కాబట్టి.. మీరు నా నుంచి ఎక్కువ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే.. మీ అంచనాలకి నేను రీచ్ అవ్వకపోతే.. నన్ను క్షమించండి’ అంటూ త్రివిక్రమ్.. నటుడు రాహుల్ రవీంద్రన్ ను  (Rahul Ravindran) ఉద్దేశించి చెప్పాడు. మీ స్పీచ్ కోసం అతను వెయిట్ చేస్తున్నట్టు త్రివిక్రమ్ కి చెప్పాడట. అందుకు త్రివిక్రమ్ పై డైలాగ్ పలికాడు. అయితే వీటిని ‘గుంటూరు కారం’ సినిమా రిజల్ట్ కి రిలేట్ అవుతున్నాయని, పరోక్షంగా త్రివిక్రమ్.. మహేష్ అభిమానులకు క్షమాపణ చెప్పాడని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

 అన్నీ అబద్ధాలే అంటూ ఫైర్ అయిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus