RRR, KGF2: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?

ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బీస్ట్, కేజీఎఫ్2 సినిమాలు విడుదల కావడంతో ఆర్ఆర్ఆర్ మూవీని ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్య భారీగా తగ్గింది. కేజీఎఫ్2 సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ హవాకు కేజీఎఫ్2 బ్రేకులు వేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పటికీ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ కొన్ని థియేటర్లలోనే ప్రదర్శితమవుతున్నా ఇప్పటివరకు ఈ సినిమాను చూడని ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Click Here To Watch NOW

ముంబై, హైదరాబాద్, కర్నూలు, ఇతర ముఖ్య ప్రాంతాలలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. అయితే ఈ వీకెండ్ తర్వాత మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటే అవకాశాలుతక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కేజీఎఫ్2 ప్రభావం పడినా ఆర్ఆర్ఆర్ రిలీజై మూడు వారాలు కావడంతో నిర్మాతలు కూడా ఈ సినిమా నుంచి భారీ మొత్తంలో కలెక్షన్లను అయితే ఆశించడం లేదని తెలుస్తోంది. మరోవైపు కేజీఎఫ్2 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ వీకెండ్ నాటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని యశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫుల్ రన్ లో కేజీఎఫ్2 కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది. కేజీఎఫ్2 తర్వాత యశ్ సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

యశ్ తర్వాత సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేజీఎఫ్1, కేజీఎఫ్2 సక్సెస్ తో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాల విజయాలు శ్రీనిధి క్రేజ్ ను మరింత పెంచాయని చెప్పవచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus