నిన్నటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చరణ్ తప్పు ఏం లేకపోయినా చరణ్ గురించి నెగిటివ్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ కాగా చరణ్ ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. చరణ్ రెండు సినిమాలకు అపజయం ఎరుగని దర్శకులు పని చేస్తుండటం గమనార్హం.
చరణ్ తర్వాత సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. రామ్ చరణ్ ప్రస్తుతం హ్యాపీ మొబైల్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ సంస్థ ఇచ్చిన ఫుల్ యాడ్ లో రామ్ చరణ్ తెల్లని దుస్తుల్లో జాతీయ జెండా ఎగురవేస్తున్నట్టు ప్రముఖ పత్రికలో యాడ్ వచ్చింది. అయితే చరణ్ ఎగురవేసిన జెండాలో అశోకచక్రం లేకపోవడంతో చరణ్ జెండాను అవమానించారని కామెంట్లు వినిపించాయి.
అయితే ఆ సంస్థ మాత్రం వ్యాపార ప్రకటనల కొరకు జాతీయ జెండాను ఉపయోగించడం నేరమని అందుకే అలా వాడామని తెలిపింది. అలా చేయడం నేరం కాదని సంస్థ వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి చెక్ పడినట్టే అని చెప్పాలి. చరణ్ కూడా ఈ వివాదంపై స్పందించి వివరణ ఇస్తారేమో చూడాలి. మరోవైపు చరణ్ నటిస్తున్న ఆచార్య రిలీజ్ డేట్ గురించి ప్రకటన రావాల్సి ఉంది.
Today Eenadu Print paper Happi 🔥#RamCharan #RC15#SeethaRAMaRajuCHARAN#ManOfMassesRamCharan pic.twitter.com/bVvFMD90y3
— S 🔥 (@always2_suhel) August 9, 2021
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!