సీనియర్ నటుడు సాయి కుమార్ (Sai Kumar) తెలుగు వారే. కెరీర్ ప్రారంభం నుండి ఆయన విలక్షణ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యారు. మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. రాజశేఖర్ (Rajasekhar) , రజినీకాంత్ (Rajinikanth) వంటి స్టార్ హీరోలతో పాటు ఇంకా ఎంతోమంది దిగ్గజ నటులకి వాయిస్ ఇచ్చారు. అయితే సాయి కుమార్..కి హీరోగా బ్రేక్ ఇచ్చింది కన్నడ సినిమాలనే చెప్పాలి. ‘పోలీస్ స్టోరీ’ సినిమా కన్నడంలో సూపర్ హిట్.
అక్కడ రిలీజ్ అయిన కొన్నాళ్ళకి తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వరుసగా ఆయనకు పోలీస్ పాత్రలే ఎక్కువ వచ్చేవట. దాదాపు దశాబ్ద కాలం పాటు పోలీస్ పాత్రలతోనే కాలం గడిపారు సాయి కుమార్. తర్వాత ట్రెండ్ మారింది. అలాంటి సినిమాలు రొటీన్ అయిపోవడంతో ప్రేక్షకులు వాటిని పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి టైంలో సాయి కుమార్ కి అవకాశాలు కొంచెం తగ్గాయి.
పక్క భాషల్లో ఒకటి, రెండు ఆఫర్లు వచ్చినప్పటికీ, తెలుగు నుండి పెద్దగా వచ్చేవి కాదు. ఈ క్రమంలో ఆయన బుల్లితెరపై హోస్ట్ గా చేశారు. అటు తర్వాత ‘ప్రస్థానం’ (Prasthanam) ‘అయ్యారే’ సినిమాలు సాయి కుమార్ కి మంచి బ్రేక్ ఇచ్చాయి. ఆ సినిమాల్లో ఆయన నెగిటివ్ రోల్స్ చేశారు. అప్పటి నుండి ఏ దర్శకుడు ఆయన్ని అప్రోచ్ అయ్యి గ్రే షేడ్ రోల్ గురించి చెప్పినా.. వెంటనే ఓకే చెప్పేస్తూ వస్తున్నారట సాయి కుమార్.
ఈ మధ్య కాలంలో చూసుకుంటే ‘ఎవడు’ (Yevadu) ‘జై లవ కుశ’ (Jai Lava Kusa) ‘శ్రీకారం’ (Sreekaram) ‘సార్’ (Sir) … లేటెస్ట్ గా వచ్చిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వంటి సినిమాల్లో కూడా ఆయన చేసినవి నెగిటివ్ రోల్స్ అనే చెప్పాలి. ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వంటి సినిమాల్లో ఆయన పాజిటివ్ రోల్స్ చేశారు. వాటికి మంచి పేరు వచ్చినా.. ఎందుకో గ్రే షేడ్స్ ఉన్న రోల్స్ నే సాయి కుమార్ ఇష్టపడుతున్నారని ఇన్సైడ్ టాక్.