Family Star: ‘ది ఫ్యామిలీ స్టార్’ కాదు ముందుగా అనుకున్న టైటిల్ అదేనట..!

Ad not loaded.

‘గీత గోవిందం’ (Geetha Govindam) వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పరశురామ్(బుజ్జి) (Parasuram)   కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) . ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గోపి సుందర్ (Gopi Sundar)  సంగీత దర్శకుడు. ‘నంద నందన’ ‘కళ్యాణి వచ్చా’ అనే పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి.

ఏప్రిల్ 5 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రాన్ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘ది ఫ్యామిలీ స్టార్’ లో హీరో విజయ్ దేవరకొండ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్ గా కనిపించబోతున్నాడు. మిడిల్ క్లాస్ జనాలు ఎంత సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారో, ఖర్చులు పెరిగితే ఎలా కంగారుపడతారో.. అలాంటి పాత్రలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అని స్పష్టమవుతుంది.

టీజర్, ట్రైలర్స్ లో విజయ్ నటన కూడా చాలా సహజంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇది పక్కన పెడితే.. ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ వేరే ఉందట. ముందుగా ఈ చిత్రానికి ‘కుటుంబరావ్’ అనే టైటిల్ అనుకున్నారట. కానీ యూత్ కి ఇంకాస్త బాగా కనెక్ట్ అవ్వాలని భావించి తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’ గా మార్చినట్లు దిల్ రాజు (Dil Raju)  ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus