‘అరుంధతి’.. అనుష్కని ఓవర్ నైట్ స్టార్‌ని చేసిన సినిమా.. ఆమె కెరీర్ దీనికి ముందు, తర్వాత అని చెప్పుకునేంతగా మార్చేసింది.. అందరికీ అర్థమయ్యే కథ, కథనాలు.. కథకు తగ్గట్టు అద్భుతమైన విజువల్స్, అనుష్క ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్, కోటి సంగీతం, కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ ‘అరుంధతి’ ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి.. అయితే ఇదే ‘అరుంధతి’ పేరుతో సౌందర్య 1999లోనే సినిమా చేశారనే సంగతి చాలామందికి తెలియదు.. తర్వాత పదేళ్లకు 2009 సంక్రాంతికి అనుష్క ‘అరుంధతి’ వచ్చింది.
ఇక సౌందర్య సినిమా విషయానికొస్తే.. అమ్మా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద.. పాపులర్ యాక్టర్ కాస్ట్యూమ్స్ కృష్ణ సమర్పణలో.. కొల్లి వెంకటేశ్వర రావు నిర్మించారు.. మహిళా ప్రాధాన్యత కలిగిన కథలతో చిత్రాలు చేసి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత, నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు.. రామ్ కుమార్, శ్రీవిద్య, మేఘన, కిన్నెర, రాధిక, విజయ్ కుమార్, తనికెళ్ల భరణి, ఎల్.బి.శ్రీరామ్, బెనర్జీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కాస్ట్యూమ్స్ కృష్ణ తదితరులు తారాగణం.. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందించారు..
ఎల్.బి.శ్రీరామ్ డైలాగ్స్ రాశారు.. ‘అరుంధతి’ కి ‘ది అల్టిమేట్ ట్రిబ్యూట్ టు ఎ వుమెన్’ అనే క్యాప్షన్ ఇచ్చినప్పుడే దర్శకుడు ఎప్పటిలానే తన శైలిలో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా చేయబోతున్నాడని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.. శ్రీవిద్య, సౌందర్య తల్లీ కూతుళ్లుగా కనిపించడం.. తర్వాత నిజమైన తల్లి కాదని తెలియడం.. తన తల్లిందడ్రుల గురించి తెలుసుకోవడం.. మధ్యలో ప్రేమ వ్యవహారం.. ఇలా సాగిపోతుంది సినిమా..
అప్పట్లో సౌందర్యకి విపరీతమైన క్రేజ్ ఉండేది.. దాదాపు చాలా వరకు పోస్టర్ మీద సౌందర్య ఫోటో చూసే థియేటర్లకు వచ్చేవారు ఆడియన్స్.. ‘అరుంధతి’ లో కథ, కథనాలు, మాటలు, పాటలు, నటన వంటివి బాగానే ఉన్నాయి కదా అనిపించినా కానీ మితిమీరిన ఓవర్ డ్రామా కారణంగా సినిమా ఫ్లాప్ అయింది.. క్లైమాక్స్‌లో సౌందర్య, శ్రీదేవి క్యారెక్టర్లు ఒకేసారి చనిపోవడం కూడా భావోద్వేగానికి గురి చేస్తుంది.. క్రాంతి కుమార్ తర్వాత 2001లో తమిళ్ స్టార్ విక్రమ్, సౌందర్యలతో ‘9 నెలలు’ చిత్రం తీశారు..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!