Jr NTR, Mahesh Babu: తారక్, మహేష్ బాబు విషయంలో భలే జరిగిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. అయితే ఈ ఇద్దరు హీరోల విషయంలో కొన్ని పోలికలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు రాశి ఒకే రాశి కావడం గమనార్హం. ఇద్దరు హీరోల రాశి సింహ రాశి కాగా ఈ హీరోలు అటు క్లాస్ సినిమాలతో, ఇటు మాస్ సినిమాలతో మెప్పిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు సినిమాల్లో హీరోలుగా దాదాపుగా ఒకే సమయంలో ఎంట్రీ ఇచ్చారు.

Click Here To Watch NOW

మహేష్ నటించిన రాజకుమారుడు 1999 సంవత్సరంలో రిలీజ్ కాగా ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని 2001 సంవత్సరంలో విడుదలైంది. 2003 సంవత్సరంలో విడుదలైన ఒక్కడు సినిమా మహేష్ బాబుకు మాస్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ ను పెంచితే అదే ఏడాది విడుదలైన సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను పెంచింది. అయితే ఈ ఇద్దరు హీరోలకు సంబంధించి మరో విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ 29వ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కి ఘనవిజయం సాధించింది. అయితే మహేష్ బాబు 29వ సినిమాకు కూడా రాజమౌళి డైరెక్టర్ కావడం గమనార్హం. ఎన్టీఆర్ 28వ సినిమా అరవింద సమేత వీరరాఘవకు త్రివిక్రమ్ డైరెక్టర్ కాగా మహేష్ 28వ సినిమాకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ కావడం గమనార్హం. టెంపర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఆరు విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు కూడా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సాధించగా సర్కారు వారి పాట, త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలతో మహేష్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా మహేష్ కొరటాల శివ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. కొరటాల శివ తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus