Digangana Suryavanshi: ‘సీటీమార్’.. ఆ హీరోయిన్ కు చాలా అన్యాయం జరిగింది..!

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’.గతవారం సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ‘సీటిమార్’. దర్శకుడు సంపత్ నంది పాత పాయింట్ నే తీసుకున్నప్పటికీ.. ఎంగేజింగ్ టేకింగ్ తో మాస్ కు కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా తమన్నా నటించింది. అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంది.

ఆమె పేరు దిగంగన సూర్యవంశీ.’సీటీమార్’ మూవీ విడుదల సమయంలో ఈమెను పెద్దగా ప్రమోట్ చేయలేదు చిత్ర యూనిట్ సభ్యులు. మీడియాలో కూడా ఈమె గురించి పెద్దగా చర్చ జరిగింది కూడా లేదు. గతంలో ఈమె ‘హిప్పీ’ ‘వలయం’ వంటి సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. ‘సీటీమార్’ లో ఈమె లుక్స్ చాలా బాగున్నాయి. సిటీ ఛానల్లో న్యూస్ ప్రెజంటర్ గా పనిచేసే ఆకృతి పాత్రని ఈమె పోషించింది. రావు రమేష్ తో కలిసి ఈమె చేసిన కామెడీ కూడా ఆకట్టుకుంటుంది.

ఈమె చూడడానికి పొడుగ్గా ఉంటుంది కాబట్టి గోపీచంద్ పక్కన కరెక్ట్ గా సరిపోతుంది. కానీ హీరోతో ఈమెకు కాంబినేషనల్ సీన్స్ లేవు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈమెకు సంబంధించి చాలా సీన్లు చిత్రీకరించారట. కానీ నిడివి ఎక్కువవుతుంది అనే ఉద్దేశంతో ఎడిటింగ్లో లేపేసారని వినికిడి. అంతేకాదు ఆ లేపేసిన భాగంలో గోపీచంద్ కు ఈమెకు ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని తెలుస్తుంది. దిగంగన మెయిన్ లీడ్ పోషించడానికి అన్ని అరహతలు కలిగిన బ్యూటీ. వీటన్నిటిని బట్టి చూస్తే ఆమెకు పెద్ద అన్యాయమే జరిగిందని చెప్పాలి..!

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus