నితిన్ (Nithiin) హీరోగా వి.వి.వినాయక్ (V. V. Vinayak) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దిల్’ దీనికి ‘ది పవర్ ఆఫ్ యూత్’ అనేది క్యాప్షన్. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై రాజు అలియాస్ దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. ఆర్.పి.పట్నాయక్ (R. P. Patnaik) ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 2003 ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు దిల్ రాజు.
Dil Collections:
ఆ తర్వాత ఆయన సక్సెస్ ఫుల్ జర్నీ అందరికీ తెలిసిందే. ఇక ‘దిల్’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
‘దిల్’ సినిమా రూ.6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.11.8 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.