ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో.. ఇది ఎప్పటికీ ఎడతెగని డిస్కషనే. అది తెలుగు ఇండస్ట్రీ అయినా, తమిళ ఇండస్ట్రీ అయినా.. ఈ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే దాని గురించి అభిమానులు మాట్లాడుకోవడమే తప్ప, నిర్మాతలు – దర్శకులు మాట్లాడింది చాలా తక్కువ. అయితే తమిళ నాట నెంబర్ 1 హీరో ఎవరు అనే విషయంలో తెలుగు నిర్మాత మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ ఆ నిర్మాత ఇంకా తన మాట మీదే నిలబడటం ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది అని చెప్పాలి.
ఇదంతా దిల్ రాజు గురించి.. ఆయన చెప్పిన తమిళ నెంబర్ 1 హీరో గురించే అని మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. తమిళ పరిశ్రమలో అజిత్ ఏముంది.. విజయే కదా నెంబర్ 1 అని ఆ మధ్య దిల్ రాజు అన్న విషయం తెలిసిందే. అదెలా అంటారు.. అజిత్ ఫ్యాన్స్ సంగతి మీకు తెలియదా అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో దిల్ రాజును కడిగిపారేశారు. అయినా దిల్ రాజు తన మాట మీదే నిలబడ్డారు. విజయ్‌ని నెంబర్ వన్ అని ఎందుకు అన్నారో మరోసారి వివరించారు.
సంక్రాంతికి తెలుగు సినిమాలతో పోటీ విజయ్ సినిమాను తీసుకురావడంతో పొంగల్ పోరు మొదలైంది. తెలుగు హీరోలను కాదని, తమిళ హీరోకు అన్ని థియేటర్లు ఎలా ఇస్తారు అంటూ నిర్మాతల నుండే చర్చ వచ్చింది. ఆ తర్వాత ఫ్యాన్స్ కూడా మొదలుపెట్టారు. సరిగ్గా ఈ సమయంలో ఇష్యూను తమిళ వైపు తీసుకెళ్లారు దిల్ రాజు. తమిళంలో విజయ్ పెద్ద హీరో కాబట్టి.. ఆయనకు అజిత్ సినిమా ‘తునివు’ కంటే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలనేది దిల్ రాజు మాట. తాజాగా మరోసారీ అదే మాట అన్నారు.
విజయ్ తమిళంలో నంబర్ వన్ హీరో అనే మాటకు కట్టుబడి ఉన్నాను అన్న దిల్ రాజు.. ఒక హీరో స్టార్ పవర్ ఏంటన్నది థియేట్రికల్ రెవెన్యూను బట్టే ఆధారపడి ఉంటుందని, ఆ లెక్కన తమిళంలో విజయే నంబర్ వన్ హీరో అని అన్నారు. విజయ్ నటించిన గత అయిదారు సినిమాలు టాక్, రిజల్ట్‌తో సంబంధం లేకుండా మినిమం రూ.60 కోట్ల షేర్ రాబట్టాయి. అలాంటి రికార్డు తమిళంలో ఇంకెవరికీ లేదు. అందుకే అక్కడున్న హీరోల కంటే విజయ్ బిగ్ స్టార్ అని అన్నాను అంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?