రాజమౌళి (S. S. Rajamouli) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel), సుకుమార్ (Sukumar) వంటి గ్లోబల్ డైరెక్టర్స్ పక్కన మలయాళ నటుడు/దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా చోటు సంపాదించుకుంటాడు అని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తెలిపారు. ఈరోజు ‘ఎంపురాన్’ (L2: Empuraan) తెలుగు ప్రమోషన్లో భాగంగా మోహన్ లాల్ (Mohanlal) , పృథ్వీరాజ్..లు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో దిల్ రాజు ఈ విధంగా చెప్పుకొచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “మన సినిమాల్ని గ్లోబల్ సినిమాలుగా మార్చిన కొందరు దర్శకులను తలుచుకోవలసిన టైం ఇది.
అందులో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ తో (Baahubali) తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. తర్వాత ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్’ తో (KGF) దాన్ని కంటిన్యూ చేశారు. అలాగే ‘పుష్ప’ తో (Pushpa) సుకుమార్ కూడా ఆ లిస్టులో చేరారు. ఇప్పుడు మలయాళ నటుడు పృథ్వీరాజ్ వంతు వచ్చింది. ‘లూసిఫర్’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ‘ఎల్ 2 ..’ దాన్ని మించి విజయం సాధిస్తుంది. మలయాళం సౌత్ లో చిన్న ఇండస్ట్రీ అంటారు.
అలాంటిది ‘లూసిఫర్’ సినిమాని ఆ టైంలో రూ.40 కోట్లు పెట్టి తీసి పెద్ద సక్సెస్ కొట్టారు. ఇక పార్ట్ 2 కి వచ్చేసరికి ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే ఈ సినిమా ట్రైలర్ నాకు మొదట చెన్నైలో చూపించే ముందు … ‘ఇది కొంచెం పెద్దగా ఉంటుంది భయపడకండి’ అని నాకు చెప్పారు. అది 3 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉంది. ఆ ట్రైలర్లో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి.
చాలా కథలు అల్లుకునేలా ట్రైలర్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇది కంప్లీట్ పాన్ ఇండియా సినిమా. కచ్చితంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్..ల సరసన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నిలుస్తారు. ఒకవేళ దీనికి పార్ట్ 3 ఉంటే.. అది రూ.300 కోట్ల బడ్జెట్ తో తీసి.. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
రాజమౌళి వల్లే మన సినిమాలకి గ్లోబల్ రేంజ్ వచ్చింది
– దిల్ రాజు#DilRaju #Mohanlal #PrithvirajSukumaran pic.twitter.com/sGfwxOKNst— Filmy Focus (@FilmyFocus) March 22, 2025