‘ఆర్య’ టు ‘ఎఫ్3’… దిల్ రాజు- దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన 14 సినిమాలు..!

టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. ఆయన బ్యానర్లో ఓ సినిమా రూపొందింది అంటే అది కచ్చితంగా హిట్టే అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడింది. దిల్ రాజు ఎలాంటి దర్శకుడితో సినిమా చేసినా అది సక్సెస్ అయినట్టే.. ఈ విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. ట్రెండ్ కు తగ్గట్టు ఆయన కథల్ని ఎంపిక చేసుకోరు.. ఆయన ఏ కథను ఎంపిక చేసుకున్నా..ఆ కథను అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా రూపొందిస్తారు దిల్ రాజు.

ఇక దేవి శ్రీ ప్రసాద్.. విషయానికి వస్తే కెరీర్ ప్రారంభం నుంచి ఏ సినిమాకి పని చేసినా అద్భుతమైన మ్యూజిక్ అందిస్తుంటాడు. చిన్న సినిమాకి ఒకలా పెద్ద సినిమాలకి ఇంకోలా అన్నట్టు కాదు.. ఆయన ఏ సినిమాకి సంగీతం అందించినా మంచి మ్యూజిక్ ఇస్తాడు అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అప్పట్లో ఏ స్టార్ హీరో సినిమాకి అయినా దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తే బాగుణ్ణు అని చాలా మంది అనుకునేవారు. ఆయన సినిమాల్లోని పాటలు ఒక్కసారి వింటే చాలు వెంటనే ఎక్కేసేవిగా ఉంటాయి. ఇప్పుడు దేవి శ్రీ మ్యూజిక్ ఇంపాక్ట్ కాస్త తగ్గింది అనుకోండి అది వేరే విషయం.

ఇదిలా ఉండగా.. దేవి శ్రీ ప్రసాద్ కు టాలీవుడ్లో బాగా కలిసొచ్చిన ప్రొడ్యూసర్ ఒకరున్నారు. ఆయనే దిల్ రాజు. వీళ్ళ కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా అది మినిమమ్ గ్యారెంటీ. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది.’ఆర్య’ దగ్గర్నుంచీ తాజాగా విడుదలైన ‘ఎఫ్3’ వరకు వీళ్ళ కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఎన్ని హిట్ అయ్యాయి. అనే విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్య :

17aarya

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

2) భద్ర :

2 Star heros rejected Ravi Teja's Bhadra movie1

రవితేజ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

3) బొమ్మరిల్లు :

22bommarillu

సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మ్యూజిక్ కూడా ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యింది.

4) మిస్టర్ పర్ఫెక్ట్ :

6mrperfect

ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా బాగా ప్లస్ అయ్యింది.

5) ఎవడు :

రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి కూడా దిల్ రాజు నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ కూడా కమర్షియల్ హిట్ అనిపించుకుంది.

6) నేను లోకల్ :

nani, Nenu Local Movie, keerthy suresh, Dil Raju, DSP

నాని హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

7) డిజె(దువ్వాడ జగన్నాథం) :

Duvvada Jagannadam

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించారు. దీనికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు బ్యానర్లో రూపొందిన 50వ చిత్రమిది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది.

8) ఎం.సి.ఎ(మిడిల్ క్లాస్ అబ్బాయి) :

MCA

నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా కమర్షియల్ హిట్ అనిపించుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

9) హలో గురు ప్రేమ కోసమే :

రామ్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

10) ఎఫ్2 :

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.

11) మహర్షి :

9-maharshi

మహేష్ బాబు 25వ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. అశ్వినీ దత్, పీవీపీ లతో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది.

12) సరిలేరు నీకెవ్వరు :

Sarileru Neekevvaru movie new poster

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీకి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

13) రౌడీ బాయ్స్ :

దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేశాడు.దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

14) ఎఫ్3 :

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా ‘ఎఫ్2’ కి ‘సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ కూడా హిట్ టాక్ ను సంపాదించుకుంది.

Share.