కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకుడు. కళ్యాణ్ రామ్ మార్కెట్ కి మించిన బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.80 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది ఈ సినిమా. కళ్యాణ్ రామ్ మార్కెట్ ను కూడా పెంచింది. కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఆయన చేసిన రిస్క్ కూడా ఫలించింది.
ఇక ‘బింబిసార’ కి సీక్వెల్ గా ‘బింబిసార 2’ ఉంటుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అతను తప్పుకోవడం ‘రొమాంటిక్’ దర్శకుడు అనిల్ పాదూరి ‘బింబిసార 2’ ని టేకప్ చేయడం జరిగింది. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్పి క్లారిటీ ఇచ్చాడు మల్లిడి వశిష్ట్.
మల్లిడి వశిష్ట్ మాట్లాడుతూ.. ” ‘బింబిసార 2’ పై నేను అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నేను ‘బింబిసార 2’ నుండి తప్పుకున్నాను, ఏదో అయ్యింది అంటూ ఏంటేంటో అనేసుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. నేను ‘బింబిసార’ చేసినప్పుడు అనిల్ పాదూరి చాలా హెల్ప్ చేశాడు. నేను ‘బింబిసార 2’ చేయడానికి రెడీ అయినప్పుడు.. నాకంటే మంచి ఐడియా అతను క్రాక్ చేశాడు.
అతని ఐడియా బాగుందని నేను, కళ్యాణ్ గారు కూడా ఫిక్స్ అయ్యాం.! కాబట్టి.. అతని ఐడియాని నేను ఓన్ చేసుకుని చేయడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే అతన్నే చేయమని నేను చెప్పడం జరిగింది. నాకు ఎలాగు చిరంజీవి గారి ప్రాజెక్టు పై వర్క్ చేయాల్సి వచ్చింది. కానీ అసలు విషయం ఇది” అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక మల్లిడి వశిష్ట్ తర్వాత ‘విశ్వంభర’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.