హీరోయిన్ నందినీ రాయ్ అందరికీ సుపరిచితమే. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్ద గుర్తింపు రాలేదు. అయితే ‘బిగ్ బాస్’ సీజన్ 2 ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. కొంత నెగిటివిటీ ఫేస్ చేసినా.. తర్వాత ఆ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికంటే ఈమెకే ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ డౌన్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిని రాయ్ విజయ్ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “ఓ స్టార్ హీరో సినిమాలో నా పాత్రని బాగా కట్ చేశారు. ఉదాహరణకి ‘వారసుడు’ అనే సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ రోల్ అది. సినిమాలో కీలకమైన పాత్ర అని చెప్పారు. హీరో అన్నగా చేసిన శ్రీకాంత్ తో ఎఫైర్ పెట్టుకొని.. తర్వాత ఫ్యామిలీని సెపరేట్ చేసే రోల్ అది. నేను షూటింగ్లో ఎక్కువ రోజులే పాల్గొన్నాను. కానీ సినిమాలో నా పాత్రని చాలా వరకు కట్ చేశారు.
అసలు నేను యాక్ట్ చేసిన మెయిన్ సీన్స్ ఏవీ సినిమాలో లేవు. సినిమా ప్రమోషన్స్ లో నా పాత్రను తెలుపుతూ ఓ పోస్టర్ కూడా వదిలారు. కానీ సినిమాలో ఆ పాత్ర ఎక్కడ వచ్చిందో కూడా చాలా మంది నోటీస్ చేయలేదు. ‘వారసుడు’ లో నేను కనిపించింది 2 నిమిషాలే.అది నన్ను చాలా బాధ పెట్టింది. ఇక ఇలాంటి రోల్స్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.