సినీ పరిశ్రమలో వారసత్వం గురించి చాలా డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి రానివ్వకుండా, వచ్చినా ఎదగనివ్వకుండా చేస్తారు అనే అపోహ చాలా కాలం నుండి ఉంది. కానీ అది పూర్తిగా నిజం కాదు. కొత్త దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను మార్కెట్ చేసుకోవడానికి స్టార్ కిడ్స్ ని తీసుకుంటారు. అలాగే స్టార్స్ తమ వారసులు కోసం దర్శకనిర్మాతలను కోరితే వారు కాదనలేరు. ఒప్పుకుంటారు. అలా వారికి ఎంట్రీ ఫ్రీగా దొరుకుతుంది. కానీ సక్సెస్ అవ్వడం అనేది పూర్తిగా ఆ వారసుల టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ సక్సెస్ కాలేకపోతే ఆ తర్వాత స్టార్స్ ఎంతలా పుష్ చేసినా ఉపయోగం ఉండదు. ఇదిలా ఉంటే.. చాలా మంది స్టార్స్ తమ కొడుకులను హీరోలుగా లాంచ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ తమ కూతుళ్లను హీరోయిన్లుగా చేయడానికి ఆసక్తి చూపరు. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. అయితే స్టార్స్ ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎక్కువగా సక్సెస్ అయ్యింది కూడా లేదు.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఓ ఫ్యామిలీ నుండి ఏకంగా 7 మంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారట. ఆ ఫ్యామిలీ ఎవరిది అనుకుంటున్నారా.. అతిలోక సుందరి శ్రీదేవి ఫ్యామిలీ. అవును శ్రీదేవి హీరోయిన్ గా ఇండియన్ సినీ పరిశ్రమని షేక్ చేసిన తర్వాత.. ఆమె ఫ్యామిలీ నుండి నగ్మా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సక్సెస్ అయ్యింది. అలాగే ఆమె సోదరి రోషిని కూడా చిరంజీవి ‘మాస్టర్’ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత బాలకృష్ణ ‘పవిత్ర ప్రేమ’, శ్రీకాంత్ ‘శుభలేఖలు’ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక వీరి సోదరి జ్యోతిక కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత ‘గులాబీ’ తో మహేశ్వరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా సక్సెస్ అందుకుంది. వీళ్లంతా శ్రీదేవికి కజిన్స్ అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా శ్రీదేవి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్లందరూ సత్తా చాటారు.