Dil Raju: ఆ సంఘటన చూసి కష్టం మొత్తం మరిచిపోయాం… దిల్ రాజు కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు తాజాగా వరీసు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పివిపి బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన వరిసు సినిమా తెలుగు తమిళ భాషలలో తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ తలపతి రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా జనవరి 11వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదల కావాల్సి ఉండగా తెలుగులో వాయిదా పడింది.

తెలుగులో బాలకృష్ణ చిరంజీవి సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో థియేటర్ల సమస్య వల్ల ఈ సినిమాని మరొక రోజు వాయిదా వేశారు అనగా ఈ సినిమా తెలుగులో జనవరి 14వ తేదీ విడుదల కానుంది.ఇక తమిళంలో 11వ తేదీ విడుదలైన ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమాకు వస్తున్నటువంటి ఆదరణ చూసినటువంటి డైరెక్టర్ వంశీ పైడిపల్లి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ బొమ్మరిల్లు సినిమా చూస్తున్న సమయంలో ఒక ఫోన్ కాల్ రావడంతో తాను ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నానని అయితే తిరిగి ఇన్ని సంవత్సరాలకు కన్నీళ్లు వచ్చాయని దిల్ రాజు తెలిపారు.ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూసామని క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరూ లేచి చప్పట్లు కొడుతూ సినిమానుచూస్తూ ఎంజాయ్ చేయడంతో ఆ క్షణం మేం పడిన కష్టం మొత్తం మర్చిపోయామని దిల్ రాజు తెలిపారు.

మా నమ్మకం నిజం కావడంతో వచ్చిన ఆనంద భాష్పాలు అవి అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించడం విశేషం. ఇక మరికొన్ని గంటలలో తెలుగులో కూడా ఈ సినిమా వారసుడి పేరిట ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తెలుగులో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus