“వి” వల్ల “దిల్” రాజుకు వచ్చిన నష్టాలు నామమాత్రమే!

  • September 8, 2020 / 03:39 PM IST

‘దిల్’ రాజు తెలివి మామూలు తెలివి కాదని టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. ‘వి’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చెయ్యడంతో మరోసారి దిల్ రాజు తెలివి ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది. డిమాండ్ అండ్ సప్లయ్… ఏ వ్యాపారమైనా ఈ సూత్రం మీదే నడుస్తుంది. డిమాండ్ ఉన్న సరుకు అమ్మడం మానేసి, లేని చోట అమ్మడంలో అర్థం లేదు. దీన్ని బాగా అర్థం చేసుకున్న దిల్ రాజు, కరోనా కారణంగా థియేటర్లో మూతపడడంతో ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో ఓటీటీలో సినిమాలకు డిమాండ్ ఉండడంతో ‘వి’ని అమెజాన్ ప్రైమ్ కి అమ్మారు.

‘దిల్’‌ రాజు జస్ట్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. ఆయన ఎగ్జిబిటర్. డిస్ట్రిబ్యూటర్ కూడా! బోలెడు థియేటర్లో ఆయన ఆధీనంలో ఉన్నాయి. వాటి కోసమైనా సినిమాను ఉంచకుండా, ఓటీటీకి ఎందుకు అమ్మారు అనేది విడుదలకు ముందు చాలా మందికి అర్థం కాలేదు. విడుదలైన తర్వాత థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తే… రెండో రోజు కి దుకాణం సర్దేయాల్సి వస్తుందని ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతున్నారు. ఓటీటీకి సినిమాను అని మంచి పని చేశారని అంటున్నారు.

‘వి’ని 33 కోట్ల రూపాయలకు కనీసం వాళ్ళకి ఇచ్చారట. అందులో 18 కోట్ల రూపాయలను విడుదలకు ముందుగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. ఆల్రెడీ దిల్ రాజు చేతికి ఆ డబ్బు వచ్చిందని టాక్. ఆరు నెలల తర్వాత మిగతా డబ్బులు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. అందువల్ల ఆయనకు నష్టాలు నామమాత్రంగానే వచ్చాయని ట్రేడ్ వర్గాల టాక్‌. థియేటర్లలో విడుదల చేసి ఉంటే ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చేది కాదని అంటున్నారు. ఎలాగో శాటిలైట్ హక్కులు అమ్ముకుంటారు. రేపు థియేటర్లు తెరిచిన తర్వాత అందులోనే విడుదల చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఆల్రెడీ వచ్చిన టాక్ వల్ల థియేటర్లలో లో విడుదల చేసే అవకాశాలు అయితే లేవు. మొత్తం మీద దిల్ రాజు తెలివిగా వ్యవహరించారని చెప్పుకోవాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus