Dil Raju: దిల్ రాజు చెప్పారు సరే.. వర్కౌట్ అవుతుందా?

గతంలో అయితే ఒక సినిమా రిలీజ్ అయ్యి.. మొదటి షో పడిన గంట, రెండు గంటల తర్వాత రివ్యూలు వచ్చేవి. వాటి కోసం అంతా ఎదురుచూసేవారు. సమీక్షకుడి కోణంలో సినిమా ఎలా ఉంది.. అనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కానీ తర్వాత యూట్యూబ్ రివ్యూయర్లు పుట్టుకొచ్చారు. వాళ్ళు షో పడటమే.. బయటకు వచ్చి తమకు ఇష్టం వచ్చినట్టు టాక్ చెబుతున్నారు. అందులో కూడా తప్పు లేదు. కానీ కొంతమంది హైలెట్ అవ్వడం కోసం ‘సినిమాలో ఇది బాలేదు, అది బాలేదు’ అంటూ చెబుతుంటారు.

Dil Raju

అక్కడితో ఆగిపోయినా పర్వాలేదు క్రాఫ్ట్ పై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణుల పై పర్సనల్ ఎటాక్ చేయడం వంటివి కూడా చేస్తున్నారు. యూట్యూబ్లో బి గ్రేడ్ వీడియోల్లో నటించేవారు సైతం వచ్చి ‘ఆ పెద్ద సినిమాలో ఏముంది.. ఈ సినిమా బాగుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్లోనే కాకుండా మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో కూడా ఇదే జరుగుతుంది. ఇలాంటివి సినిమాని పూర్తిగా కిల్ చేసే అవకాశాలు ఎక్కువ.

అందుకే కేరళలో యూట్యూబ్ రివ్యూవర్లని, నెగిటివ్ గా పబ్లిక్ టాక్ చెప్పేవారిని థియేటర్లలోకి అనుమతి ఇవ్వకూడదు అని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో మాట్లాడి కఠిన నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్లో కూడా ఇదే ఫాలో అవ్వబోతున్నట్టు నిన్న ప్రకటన వచ్చింది. టాలీవుడ్లో కూడా ఇదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉందని తాజాగా దిల్ రాజు (Dil Raju) తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో మీటింగ్లు జరిపి ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

అది వర్కౌట్ అయితే.. ఇక్కడి థియేటర్స్ లోకి కూడా యూట్యూబ్ రివ్యూయర్లని, నెగిటివ్ టాక్ చెప్పే వారిని అనుమతించరు అని స్పష్టమవుతుంది. థియేటర్ చుట్టుపక్కల కూడా ఇలాంటి పబ్లిక్ టాక్ లు చెప్పకుండా ఆంక్షలు విదిస్తారట. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

పుష్ప 2: హైదరాబాద్ లో మొదటి షో.. ఒక రోజు ముందుగానే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus