Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!
- May 26, 2025 / 05:28 PM ISTByPhani Kumar
థియేటర్ల ఇష్యూ.. ‘ఆ నలుగురు’ టాపిక్ గురించి నిన్న అల్లు అరవింద్ (Allu Aravind) ఓ ప్రెస్ మీట్ పెట్టారు. తన కంట్రోల్లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ‘ఆ నలుగురు లో నేను లేను’ అంటూ వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు దిల్ రాజు(Dil Raju) వంతు వచ్చింది. ఆయన కూడా ఈ విషయమై ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన.. ” ఛాంబర్లో జరిగిన ప్రెస్ మీట్ తప్పుదోవ పట్టిందని, ఎక్కడో ఈస్ట్ గోదావరిలో మొదలైన ఈ ఇష్యూని ఆధారం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి రాంగ్ గా ప్రోజెక్ట్ అయ్యి ఉండవచ్చు” అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.
Dil Raju

అలాగే తన కంట్రోల్లో కూడా 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని. ‘ఆ నలుగురు’ లో నేను కూడా లేను.. నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు’ అన్నట్టు దిల్ రాజు (Dil Raju) చెప్పుకొచ్చారు. అలాగే దిల్ రాజు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ గురించి స్పందిస్తూ.. “ఒకవేళ కళ్యాణ్ గారికి కోపం వస్తే…రానివ్వండి. ఆయన పెద్దన్న తిడతారు.. మేము పడతాం.తప్పేముంది..! ఈ ఘటనతో ఆయన నిజంగానే హర్ట్ అయ్యారు….తిడతాను అంటే పడతాం.

అందులో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని నేను 22 ఏళ్ల నుండి చూస్తున్నాను. ఆయన కోపం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆయనకు కోపం వచ్చేలా ఇప్పుడు సీన్ జరిగింది కాబట్టి ఆయన సీరియస్ అయ్యారు. అందులో అర్థం ఉంది. కాకపోతే ఆయన సినిమాకు నెగిటివిటి చేయడానికి ఇదంతా చేశారు అనేది కరెక్ట్ కాదు.కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేదు” అంటూ చెప్పుకొచ్చారు.
పవన్ అడిగినవన్నీ పాత ప్రశ్నలే.. ఇన్నాళ్లూ ఎవరూ ఏం చేయలేకపోయారు.. మరి!
పవన్ కళ్యాణ్ పెద్దన్న లాంటోడు.. తిడితే పడతాం!
కళ్యాణ్ గారు నాకు 22 ఏళ్లుగా తెలుసు..#DilRaju #Pawanakalyan pic.twitter.com/SrRxNniyvk— Filmy Focus (@FilmyFocus) May 26, 2025
కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేదు#DilRaju #HariHaraVeeraMallu #Pawanakalyan pic.twitter.com/gyRM5TUKee
— Filmy Focus (@FilmyFocus) May 26, 2025

















