Dil Raju: ‘ఆచార్య’ ‘సర్కారు..’ విషయంలో జరిగిన తప్పు ‘ఎఫ్3’ విషయంలో జరగకూడదని..!

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత జనాలు థియేటర్లకు వెళ్లే పద్ధతి మారింది. పెద్ద నిర్మాణ సంస్థలు విచ్చల విడిగా టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. పెద్ద సినిమాల విడుదల టైంలో టికెట్ రేట్లు భారీగా పెంచేయడం వల్ల మధ్యతరగతి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ 2’ వంటివి పాన్ ఇండియా సినిమాలు మొదటి నుండీ భారీ క్రేజ్ దక్కించుకున్న సినిమాలు కాబట్టి వాటికి వెళ్లి చూశారు. కానీ ‘ఆచార్య’ ‘రాధే శ్యామ్’ ల విషయంలో వాళ్ళు థియేటర్లకు రాలేదు.

‘సర్కారు వారి పాట’ సినిమాకి కూడా కొంతలో కొంత అదే ఇబ్బంది. కానీ ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల జనాలు కొద్ది మొత్తంలో థియేటర్ల మెట్లు ఎక్కుతున్నారు. అయితే టికెట్ రేట్లు కనుక తగ్గిస్తే సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో దిల్ రాజు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోబోతున్నారు అని వినికిడి. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘ఎఫ్3’ మూవీ మే 27న విడుదల కాబోతుంది.

‘ఎఫ్2’ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా బాగా జరిగింది. అయితే ఈ చిత్రం టికెట్ హైక్స్ కోసం దిల్ రాజు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. రెగ్యులర్ టికెట్ రేట్లతోనే సినిమాని విడుదుల చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. నిజంగా ఇది మంచి డెసిషన్ అనే చెప్పాలి.

ఎందుకంటే వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరికీ కూడా రూ.100 కోట్ల మార్కెట్ అయితే లేదు. పైగా సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా హ్యాపీగా థియేటర్లకు వెళ్లి సినిమాని చూస్తారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus