ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఏదో ఒక రకంగా దిల్ రాజు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ పెద్ద సినిమా కోసం చిన్న సినిమాకి అన్యాయం చేస్తున్నారని.. లేదు అంటే తాను కొనుగోలు చేసిన చిన్న సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుంటున్నారని.. ఇలా రకరకాలుగా దిల్ రాజుని కాంట్రోవర్సీలోకి లాగుతూ ఉంటారు. చాలా వరకు ఆయన పద్ధతి కూడా అలానే ఉంటుంది అని చెప్పినా అతిశయోక్తి అనిపించుకోదు.
సంక్రాంతి వంటి పండుగ సీజన్లలో డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వడం కుదరదు అని ఆయనే చెబుతూ ఉంటారు. మళ్ళీ ‘మాస్టర్’ ‘వారసుడు’ వంటి ఆయన కొనుగోలు చేసిన లేదంటే నిర్మించిన డబ్బింగ్ సినిమాలకు ఆయన ఎక్కువ థియేటర్లు ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి యాంగిల్ లో కాదు కానీ వేరే విధంగా దిల్ రాజుని కొందరు విమర్శిస్తున్నారు.
మేటర్ ఏంటంటే.. ‘ఓజి’ చిత్రం నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశారు. గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియర్ షోలకు కూడా అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ప్రీమియర్ షో టికెట్స్ ను ఆన్లైన్ లో ఓపెన్ చేయనివ్వకుండా.. బ్లాక్‌లో అమ్మిస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆన్లైన్లో మల్టీప్లెక్స్ టికెట్లయితే 800కు అమ్మవలసి వస్తుందని ముందుగా సింగిల్ స్క్రీన్స్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముడు పోయేలా ప్లాన్ చేశారట దిల్ రాజు.
దీంతో ‘కాసుల కోసం కక్కుర్తి పడుతున్న దిల్ రాజు’ ‘FDC చైర్మన్‌గా ఉంటూ రూ.800 రూపాయలకు టికెట్ అమ్మాలన్న ప్రభుత్వ జీవోను పక్కన పెట్టి ఒక్కో టికెట్ రూ.2000 వేల కంటే ఎక్కువకు అమ్ముకుంటున్న దిల్ రాజు’ అంటూ చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. సుదర్శన్ 35MM, దేవి, విశ్వనాథ్, శ్రీరాములు వంటి కేవలం నాలుగు థియేటర్ల టికెట్లను దాదాపు రూ.2000 రేట్ల మార్జిన్‌తో రూ.1 కోటికి దిల్ రాజు బ్యాచ్ అమ్మారట.
కొన్ని చోట్ల అయితే ఒక్కో టిక్కెట్ ను రూ.3000-4000కు అమ్మిస్తున్నారు దిల్ రాజు అని చెబుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.