Dil Raju: కోలీవుడ్‌లో కుంపటి రాజేసి.. కష్టాల్లోపడ్డ దిల్‌ రాజు!

దిల్‌ రాజు – సంక్రాంతి.. ఈ రెండింటికీ మంచి సింక్‌ ఉంది. ఆ పండగ నాడు ఆయన నిర్మాణ సంస్థ నుండో, లేకపోతే ఆయన పంపిణీ సంస్థ నుండో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది. వసూళ్లు కూడా బాగానే ఉంటాయి. అయితే వచ్చే సంక్రాంతి మాత్రం దిల్‌ రాజుకు అస్సలు కలసి రావడం లేదు. సంక్రాంతి నేపథ్యంలో ఆయన ఏం పని చేసినా అది రిటర్న్‌ కొడుతోంది. అంతేకాదు ఆ రిటర్న్ ఫోర్స్ మామూలుగా ఉండటం లేదు.

తెలుగు నాట సంక్రాంతి వార్‌ గురించి తెలియనివారు ఉండరు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోల మధ్యలో తమిళ స్టార్‌ విజయ్ ‘వరిసు’ / ‘వారసుడు’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో తెలుగు వాళ్లను కాదని, తమిళ సినిమాకు మంచి థియేటర్లు ఇవ్వడమా అంటూ చర్చ జరుగుతోంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఆయన అన్న మాటలే ఇప్పుడు వాడుకుని ఆయన్ను టార్గెట్‌ చేశారు. అయితే వాటికి ఆయన తలొంచలేదు అనుకోండి.

ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. సంక్రాంతికి తమిళనాట ‘వరిసు’తోపాటు అజిత్‌ ‘తునివు’ కూడా వస్తోంది. ఈ సినిమాలకు చెరో సగం థియేటర్లు ఇచ్చేలా నిర్ణయం జరిగిందట. అయితే విజయ్‌ సినిమాకు థియేటర్ల విషయంలో దిల్‌ రాజు సంతృప్తిగా లేరట. ఈ క్రమంలో అజిత్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యేలా కొన్ని మాటలు మాట్లాడారని సమాచారం. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే కాన్సెప్ట్‌లో ఏవేవో అన్నారట. దీంతో అజిత్‌ ఫ్యాన్స్‌ చాలా కోపంగా ఉన్నారట.

దిల్‌ రాజు ‘వరిసు’ సినిమా ప్రమోషన్స్‌ కోసం చెన్నై వస్తారు కదా.. తమ సత్తా ఏంటో చూపిస్తాం, అజిత్‌ ఫ్యాన్స్‌ అంటే ఏంటో తెలిసేలా చేస్తాం అని అనుకుంటున్నారని కోడంబాక్కం టాక్‌. కొంతమంది అత్యుత్సాహపరులు అయితే తమిళంలో దిల్‌ రాజును తిడుతూ పోస్ట్‌లు కూడా పెడుతున్నారట. అయితే ఇలాంటి విధానం సరికాకపోయినా.. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందే దిల్ రాజే అని అంటున్నారు తటస్థ అభిమానులు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus