Dil Raju: ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈయన కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా వరిసు సినిమాని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాని తెలుగులో వారసుడు టైటిల్ తో డబ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాని దిల్ రాజు సంక్రాంతికి విడుదల చేయాలని భావించగా ఈ సినిమా డబ్బింగ్ సినిమా అని తెలియడంతో తెలుగులో కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే మొదటి ప్రియారిటి ఇవ్వాలని నిర్మాత మండలి నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే వరిసు సినిమా వివాదం రోజురోజుకు ముదురుతోంది.ఇకపోతే ఈ సినిమా వివాదంపై దిల్ రాజు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాని చూడకుండా కోట్లరూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసేది సినిమా అని ఈయన తెలిపారు. ఇలా చేయటం వల్ల డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ భారీగా దెబ్బతింటుందని తెలిపారు.

ఇండస్ట్రీ మొత్తం ఒకటే ఫ్యామిలీ అని చెప్పుకుంటారు కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనంటూ ఈయన తెలియజేశారు. ఇక తన పట్ల ఇండస్ట్రీలో చాలామందికి అసూయ ఉందని, తనంటే గిట్టని వారు తన గురించి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉంటారని ఈయన తెలిపారు.ఇక హీరోల రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడుతూ మనం 100 కోట్లు ఇచ్చిన హీరోలు తీసుకుంటారు అయితే ఇందులో నిర్మాతలదే తప్పు అన్నట్టు ఈయన తెలియజేశారు. ఒక సినిమాని నిర్మిస్తే నిర్మాతలకు వచ్చే లాభం ఏమాత్రం ఉండదని

సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే లాభాలు రావని కమర్షియల్ గా మంచి లాభాలను అందుకోవాలని ఈయన తెలిపారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కోట్లలో నష్టపోయారని ఇప్పుడు కాస్త లాభాలలో ఉన్నానని దిల్ రాజు తెలిపారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు అయిందని తనతో పాటు ఇతర బిజినెస్ లో స్థిరపడిన వారందరూ ఎక్కడికో వెళ్లారు తాను మాత్రమే ఇక్కడే ఉన్నానని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో ఉండాలంటే సిగ్గు,మానం నీతి అనేవి వదులుకోవాలని ఈ సందర్భంగా దిల్ రాజు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus