Dil Raju, Ram Charan: నిర్మాతలు నష్టపోవడానికి అదే కారణమన్న దిల్ రాజు!

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందని శంకర్ పాటల కోసం, ఫైట్ల కోసం కళ్లు చెదిరే స్థాయిలో ఖర్చు చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు తాజాగా వైరల్ అయిన వార్తల గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమా గొప్పగా ఉందని నిర్మాత వంద చెబుతాడని డిస్ట్రిబ్యూటర్ విచక్షణపైన ఆ సినిమాను ఎంత మొత్తానికి తీసుకోవాలో ఆధారపడి ఉంటుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఒక సినిమా హిట్టైతే ఎంత వస్తుందో ఫ్లాప్ అయితే ఎంత వస్తుందో డిస్ట్రిబ్యూటర్ ఆలోచించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్లదే తప్పు అని తాను గుడ్డిగా వెళ్లనని నష్టాన్ని అంచనా వేసుకుని వెళతానని దిల్ రాజు కామెంట్లు చేశారు.

బడ్జెట్ విషయంలో తప్పు నిర్మాతదని సినిమా కొనే విషయంలో తప్పు డిస్ట్రిబ్యూటర్లదే అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో తన సినిమాల బడ్జెట్ 50 కోట్ల రూపాయలు పెరిగిందని దిల్ రాజు వెల్లడించారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకు కూడా బడ్జెట్ హద్దులు దాటలేదని దిల్ రాజు తెలిపారు.

ప్రతి షెడ్యూల్ సమయంలో బడ్జెట్ పై డిస్కషన్ జరుగుతుందని ఒక షెడ్యూల్ లో బడ్జెట్ పెరిగితే మరో షెడ్యూల్ లో బడ్జెట్ ను తగ్గిస్తామని దిల్ రాజు వెల్లడించారు. భవిష్యత్తులో కలెక్షన్ల గొడవ కూడా ఉండదని అన్ని రంగాలలో మార్పులు అనివార్యమని దిల్ రాజు కామెంట్లు చేశారు. భవిష్యత్తులో ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు వేసుకునే ఛాన్స్ అయితే ఉండదని దిల్ రాజు అన్నారు. దిల్ రాజు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus